జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆగడం లేదు. ఉగ్ర మూకలు నేడు వరుస దాడులకు పాల్పడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లో తాజాగా బండిపొర జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే మూడో దాడి జరగడం కలకలం రేపుతోంది. బండిపొర జిల్లాలో తాజాగా  ఉగ్రదాడి జరగగా.. వెంటనే స్పందించిన బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షాగుండ్ హజిన్ వద్ద ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. 


ఉగ్రవాదులు బండిపొరలో ఓ పౌరుడ్ని కాల్చి చంపగా వెంటనే అప్రమత్తమైన బలగాలు రంగంలోకి దిగాయని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. నైడ్‌ఖాయ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయాడని గుర్తించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడుల ఫలితంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే మర్డర్.. అన్నంలో మత్తు మందు కలిపి ఆపై హత్య... చివరికేలా చిక్కిందంటే..!






రెండో ఉగ్రదాడి.. బండిపొర జిల్లాలో దాడికి ముందు ఉగ్రమూకలు శ్రీనగర్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. శ్రీనగర్ సమీపంలోని హవాల్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయారని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. శ్రీనగర్ లో సామాన్యులపై నేడు జరిగిన రెండో ఉగ్రదాడి ఇది కావడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.


Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !






తొలిదాడి శ్రీనగర్‌లోనే..
శ్రీనగర్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బిండ్రో మెడికెట్ ఓనర్ మఖాన్ లాల్ బిండ్రోపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్ లోని ఇక్బాల్ పార్క్ వద్ద ఈ దాడి జరిగినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు జమ్మూ కాశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో పోలీసులు, ఇతర బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.


Also Read: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి