భారత్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ అన్నారు. అక్టోబర్ 8 'ఎయిర్ ఫోర్స్ డే'కు ముందు.. చైనా, పాకిస్థాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు వాయుసేన అధిపతి.
నియంత్రణ రేఖకు అవతలి వైపు ఉన్న మూడు ఎయిర్‌బేస్‌ల వద్ద చైనా వాయుదళం ఉంది. ఏల్‌ఏసీకి ఇవతి వైపు మన వాయుసేన సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. చైనాకు అత్యాధునిక సదుపాయాలు ఉండొచ్చు.. కానీ మన వాయుసేన సన్నద్ధత ముందు అది పనిచేయదు. రఫేల్ రాకతో మన అటాకింగ్ సామర్థ్యం మరింత పెరిగింది. - వీఆర్ చౌదరీ, ఐఏఎఫ్ చీఫ్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉన్న ఎయిర్ ఫీల్డ్స్ గురించి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని చౌదరీ అన్నారు. ఎందుకంటే అవి ప్రత్యక్ష యుద్ధంలో ఉపయోగపడేంత పెద్దవి కాదన్నారు.
చైనా, పాకిస్థాన్ కలిసి వచ్చినా భారత్‌ను ఏం చేయలేవని ఐఏఎఫ్ చీఫ్ అన్నారు. వారి భాగస్వామ్యం గురించి ఆందోళన అవసరం లేదన్నారు.
Also Read:Shiba Inu Coin Price Rise: రాకెట్‌లా దూసుకుపోయిన 'షిబా ఇను'.. 24 గంటల్లో 45 శాతం!