Allahabad High Court Comments On SC ST Atrocity Cases: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC ST Act) పై అలహాబాద్ హైకోర్టు (Allahabad HC)కీలక వ్యాఖ్యలు చేసింది. బయటి వ్యక్తులు ఎవరు ఇంట్లో లేనప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో పిలిస్తే తప్పేం కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలా పిలిచిన ఘటనలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా, కులం పేరుతో పిలిస్తేనే నేరాభియోగాన్ని మోపే అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. ఇతరులు ఎవరూ ఇంట్లో లేనపుడు అన్న మాటలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోని రాదని అలహాబాద్ కోర్టు వ్యాఖ్యానించింది. బహిరంగంగా, జనం మధ్యలో కులం పేరుతో దూషించినపుడు చేసే వ్యాఖ్యలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెట్టవచ్చని స్పష్టం చేసింది.


 తన కుమారుడ్ని కావాలనే 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ...ఓ వ్యక్తి పాఠశాల యజమానికి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఇంట్లో వాదన సందర్బంగా తనను కులం పేరుతో దూషించారంటూ...అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించినపుడు అక్కడ ఎవరైనా ఉన్నారా ? ఏమని దూషించారన్న విషయాలను మాత్రం ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు.  ఎవరు లేని సమయంలో దూషించినందున, దాని బహిరం ప్రదేశంలో విమర్శించినట్లు, కులంపేరుతో తిట్టినట్లు  పరిగణించమలేని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. సదరు వ్యక్తిని కులం పేరుతో దూషించిన సమయంలో ఎవరు లేరని, ఇలా తిట్టారని చెప్పడానికి కూడా సాక్ష్యం లేదంటూ కేసును మూసేశారు. ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్ అనేది కాలేజీ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు.