Update Mobile Number In PF Account | హైదరాబాద్: దాదాపు 7 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇటీవల వడ్డీ రేట్లను 8.25 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్లుగా ఇదే వడ్డీ రేట్లను ఖాతాదారులకు అందిస్తున్నారు. అయితే పీఎఫ్ (PF) అకౌంట్‌లో సరైన మొబైల్ నంబర్ ఉండటం చాలా ముఖ్యం. ఓటీపీ (OTP) దగ్గరి నుండి పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం వరకు.. దాదాపు అన్ని పనులూ మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతాయని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ పాత నంబర్ క్లోజ్ అయిపోయి, అదే నంబర్ పీఎఫ్ అకౌంట్‌లో కూడా ఉంటే, దాన్ని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. 

Continues below advertisement

మొబైల్ నంబర్ ఎందుకు ముఖ్యం?

- పీఎఫ్ బ్యాలెన్స్ (PF Balance) చెక్ చేసుకోవడానికి

Continues below advertisement

-  పీఎఫ్ క్లెయిమ్ ఫైల్ (డ్రా) చేయడానికి కావాలి

- కేవైసీ (KYC) అప్‌డేట్ చేయడానికి అవసరం

-  ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి

Also Read: EPFO Interest Rate: 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు ఫిక్స్, ఖాతాల్లోకి జమ అయ్యేది ఎప్పుడంటే

మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?మొబైల్ నంబర్ మార్చుకోవడానికి ముందుగా ఈపీఎఫ్‌ఓ (EPFO) వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మేనేజ్ (Manage) సెక్షన్‌లోకి వెళ్లి మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అందులోనే మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆ నంబరుకు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేసుకోవాలి. లేకపోతే తరువాత ఇబ్బంది పడతారు. 

ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?మీరు పీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేసే మొబైల్ నంబర్ ఎప్పుడూ వర్కింగ్‌లో ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఇదే మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ కేవైసీ (KYC)లో కూడా అప్‌డేట్ అయి ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. వీటితో పాటు మీ ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ పీఎఫ్ అకౌంట్‌లో పాత నంబరే ఉంటే గనుక వెంటనే మార్చుకోవాలి. లేదంటే ముందు ముందు పీఎఫ్ క్లెయిమ్స్, పాస్ బుక్ డౌన్‌లోడ్, ఓటీపీకి సంబంధించిన పలు పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది.

Also Read: PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !