Chandrayaan 3: చంద్రయాన్-3 విజయంతో ఇండియా స్పేస్ ఎకానమీపై దృష్టి సారించింది.  2025 నాటికికి 13 బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా వేస్తోంది.  చంద్రయాన్-3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిపై మూడో ప్రయోగం. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనాలు భారత్ కంటే ముందున్నాయి. ఈ క్రమంలో క్రాష్ ల్యాండింగ్‌లు, ఫెయిల్ అయిన వాటిని లెక్కలోకి తీసుకోరు.  


చంద్రయాన్-3 ల్యాండ్ తర్వాత, ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ పని మొదలు పెట్టింది. డేటాను సేకరించడం స్టార్ట్ చేసింది. ఈ మిషన్ విజయవంతం అవడంతో భారతదేశం అంతరిక్ష రేసులో గొప్ప పురోగతి సాధించినట్లు అయ్యింది. అంతే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.


అంతరిక్ష ప్రయోగాల ప్రయోజనాలను ప్రపంచం ఇప్పటికే చూస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వాటర్ రీసైక్లింగ్‌తో శుభ్రమైన తాగునీటిని పొందడం, స్టార్‌లింక్ అందించిన గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్, సౌర విద్యుత్ ఉత్పత్తి, ఆరోగ్య సాంకేతికతలలో పురోగతి ప్రయోజనాలు నేరుగా చూస్తోంది. 


శాటిలైట్ ఇమేజింగ్, పొజిషనింగ్, నావిగేషన్ గ్లోబల్ డేటా కోసం పెరుగుతున్న డిమాండ్‌తో ప్రపంచం ఇప్పటికే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి దశలో ఉందని  నివేదికలు సూచిస్తున్నాయి. 2013 నుంచి ప్రైవేట్ ఈక్విటీ ద్వారా 1,791 కంపెనీలకు  272 బిలియన్ల డాలర్లు ఎలా సమీకరించారో డెలాయిట్ నివేదిక ప్రముఖంగా ప్రచురించింది. వార్షిక నివేదికలో స్పేస్ ఫౌండేషన్ 2023 రెండవ త్రైమాసికంలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 546 బిలియన్ల డాలర్లకు చేరుకుందని పేర్కొంది. గత పదేళ్లతో పోలిస్తే 91 శాతం పెరిగింది.  


భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 13 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆస్ట్రేలియన్ సివిల్ స్పేస్ స్ట్రాటజీ 2019-2028 ప్రకారం12 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2030 నాటికి అదనంగా 20,000 ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. 50 ఏళ్ల క్రితం అపోలో ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లినప్పుడు  NASA విజయవంతంగా భారీ మొత్తంలో డబ్బును ఆర్జించిన విషయం చాలా మంది మరచిపోయారు. 


బిలియన్ల సంవత్సరాల ఉల్కల పేలుళ్ల కారణంగా చంద్రుని ఉపరితలం చాలా మృదువుగా ఉందని, దుమ్ము ధూళిగాతో నిండిపోయిందని, అంతరిక్ష నౌక ఉపరితలంలోకి ఊబిలో మునిగిపోతాయని చాలా మంది భావించారు. అయితే అదృష్టవశాత్తూ అది నిజం కాదని ప్రయోగాల ద్వారా నిరూపించారు.


21వ శతాబ్దంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా అంతరిక్షయానం ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మీ సిస్టమ్ స్థిరమైన కమ్యూనికేషన్‌లను నిర్వహించగలదా? అనేక రకాల తీవ్రమైన పరిస్థితులలో స్వయంప్రతిపత్తితో పనిచేయగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ చంద్రయాన్-1తో చంద్రుడిని చేరుకోవడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం దాదాపు అన్ని మిషన్ లక్ష్యాలు, శాస్త్రీయ లక్ష్యాలలో విజయవంతమైంది. దీని ద్వారానే చంద్రుని ఉపరితలంపై నీటి సాక్ష్యాలను గుర్తించడం కూడా జరిగింది. కానీ 312 రోజుల తర్వాత అంతరిక్ష నౌక ఇస్రోతో సంబంధాన్ని కోల్పోయింది.


అయినప్పటికీ, నేషనల్ స్పేస్ సొసైటీ, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ నుంచి అవార్డులు పొందిన చంద్రయాన్-1ని చాలా మంది అసాధారణ విజయంగా పరిగణిస్తారు. అయినా పట్టు వదలని భారత్ 6 సెప్టెంబర్ 2019న, చంద్రయాన్-2 ప్రయోగించింది. ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిసి విక్రమ్ ల్యాండర్‌తో చంద్రుడిని చేరుకోవడానికి ప్రయత్నించింది. చంద్రుని ఉపరితలం నుంచి 2.1కిమీ ఎత్తు నుంచి ల్యాండర్ కూలిపోయింది. 


11 ఏప్రిల్ 2019న ఇజ్రాయెలీ బెరెషీట్ ల్యాండర్ ఉత్తర భాగంలో మృదువైన ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే బ్రేకింగ్ ప్రక్రియలో ఒక ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ గైరోస్కోప్ విఫలమైంది. ఫలితంగా ఉపరితలం నుంచి 2.1 కిలో మీటర్ల ఎత్తులో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. ఇది విజయవంతమై ఉంటే, బెరెషీట్ మొదటి విజయవంతమైన ప్రైవేట్-నిధుల మిషన్, చంద్రునిపై ఇజ్రాయెల్ మొదటి మిషన్ అయ్యేది.


25 ఏప్రిల్ 2023న, ప్రైవేట్‌గా నిధులు సమకూర్చిన ఐస్పేస్ యునైటెడ్  జపనీస్ కంపెనీ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రషీద్ రోవర్‌ను సొంత హకుటో ఆర్ ల్యాండర్‌ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది.  చివరి నిమిషంలో ల్యాండింగ్ జోన్ మార్చడంతో అంతరిక్ష నౌక చంద్ర ఉపరితలానికి  5 కి.మీ నుంచి పడిపోయి క్రాస్ ల్యాండింగ్ అయ్యింది. 


చంద్రయాన్-2, బెరెషీట్, హకుటో-ఆర్ వైఫల్యాలు ఆధునిక అంతరిక్షయానం యొక్క ఇబ్బందులను, అధునాతన సెన్సింగ్, ఇంజనీరింగ్‌లో మార్పుల ప్రాముఖ్యతను తెలిపాయి. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్-3ని మరింత పటిష్టంగా రూపొందించారు. చంద్రయాన్-3లో నాలుగు ఇంజన్లను సర్దుబాటు చేయగలిగిన థొరెటల్,  స్లేవ్, లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ ఉంటాయి. అవి చంద్రయాన్-2లా కాకుండా అన్ని దశలలో ల్యాండర్‌ను నియంత్రించగలవు.


విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ఇప్పటికే చాలా సున్నితమైన పరికరాలను తీసుకువెళ్లింది. ఇందులో మూన్‌క్వేక్‌లను గుర్తించే సీస్మోమీటర్, చంద్రుని ఉపరితలం వద్ద సూర్యుడి నుంచి చార్జ్డ్ కణాల ప్రవర్తనను కొలవడానికి లాంగ్‌ ముయిర్ ప్లాస్మా ప్రోబ్, నాసా అందించిన రెట్రో రిఫ్లెక్టర్ ఉన్నాయి. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఒక థర్మల్ ప్రోబ్ భూమిలోకి 10 సెంటీమీటర్ల లోతుకు దింపుతుంది. అది అక్కడ రోజంతా ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంది. అంతేకాదు చంద్రుని ధ్రువాల వద్ద నీటి మంచు కోసం గాలిస్తుంది.