HMPV Cases In India: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  - ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో  3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్‌కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోస వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా రెండు కేసులు వెలుగు చూశాయని చెప్పింది.


గంటల వ్యవధిలోనే మరో కేసు


కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (HMPV - హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్) కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించిన గంటల వ్యవధిలోనే , గుజరాత్‌లో మరో కేసు నమోదైంది. ఇది గుజరాత్‌లో నమోదైన మొదటి హెచ్ఎంపీవీ కేసు. ఈ వైరస్ సుమారు 2 సంవత్సరాలున్న చిన్నారిలో కనుగొన్నారు. ప్రస్తుతం పేషెంట్ ను అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. గతంలో కరోనా సమయంలో మొదట ఒకట్రెండు కేసులు నమోదు కాగా, తరువాత విపరీతంగా కేసులు పెరిగి లక్షల మంది చనిపోయారు.


కర్ణాటకలో రెండు కేసులు నమోదు


ఇక ఇంతకుముందు కర్ణాటకలో నమోదైన రెండు కేసులల్లో ఒకరు మూడేళ్ల బాలికగా.. మరొకరు 8నెలల బాలుడు ఉన్నారు. వీరిద్దరికీ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులూ ఎలాంటి ఇంటర్నేషన్ ట్రిప్ చేయనప్పటికీ.. ఇద్దరికీ బ్రోంకోప్ న్యుమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఇద్దరిలో బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. ఇక బాలుడు కోలుకుంటున్నాడని చెబుతున్నారు.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో కొత్త వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ భరోసా ఇచ్చారు. భయపడాల్సి అవసరం లేదని చెప్పారు. దేశంలో శ్వాసకోస వ్యాధుల ఇన్ఫెక్షన్స్ కు సంబంధించిన కేసులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆస్పత్రుల్లో అవసరానికి మించి సామాగ్రి, పడకలు, ఇతర మెడికల్ సౌకర్యాలు సమకూర్చమన్నారు. హెచ్ఎంపీవీ కూడా సాధారణ శ్వాసకోస వైరస్ ల మాదిరిదేనని చెప్పారు.



శీతాకాలంలో సాధారణంగా తలెత్తే శ్వాసకోస లక్షణాలే హెచ్ఎంపీవీకి ఉంటాయని అతుల్ తెలిపారు. దగ్గు, ముక్కు కారటం లేదా గాలి పీల్చుకోవడం కష్టంగా మారడం, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉండొచ్చన్న ఆయన.. తీవ్రమైన సందర్భాల్లో, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పారు. సాధారణ లక్షణాలే ఉన్నప్పటికీ తీవ్రంగా అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిని సందర్శించాలని సూచించారు.


Also Read : First HMPV Case In India: భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్