Rajasthan School Student: 


రాజస్థాన్‌లో ఘటన..


రాజస్థాన్‌లోని అల్వార్‌లో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఓ గవర్నమెంట్ స్కూల్‌లో హిందూ విద్యార్థి తిలకం పెట్టుకుని రావడంపై ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పారు. ముందు మాటలతో మొదలైన గొడవ ఆ తరవాత కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇరు వర్గాల కుటుంబాలు కూడా ఘర్షణ పడ్డాయి. చోమా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 11వ తరగతి చదువుతున్న శుభం రాజ్‌పూత్ నుదుటిపై తిలకం పెట్టుకుని స్కూల్‌కి వెళ్లాడు. ఇది చూసి కొందరు ముస్లిం విద్యార్థులు ప్రశ్నించారు. దీనిపై మాటామాట పెరిగింది. దాదాపు 500 మంది ఘర్షణ పడే వరకూ వెళ్లింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఒక్కసారిగా అలజడి పెరగడం వల్ల పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. జులై 25న ఈ ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా రెండు వర్గాలు వెనక్కి తగ్గలేదు. బొట్టు పెట్టుకుంటే మీకేం ఇబ్బంది అంటూ హిందువులు విరుచుకు పడ్డారు. బొట్టు తీసేయకపోతే అంతు చూస్తామంటూ బెదిరించినట్టు ఆరోపించారు బాధితులు. బాధితుడు ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థిపై దాడి చేశారు. బలవంతంగా బొట్టు చెరిపేశారు. అంతే కాదు. ఇస్లాంలోకి మారిపోవాలని బలవంతం చేశారు. ఇది తెలుసుకున్న వెంటనే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చారు. వాళ్లను కూడా ఇస్లాం మతంలోకి మారిపోవాలని బెదిరించారు. ఇది రాజకీయంగానూ వేడి రాజేసింది. ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండి పడ్డారు. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 


ఝార్ఖండ్‌లోనూ..


ఝార్ఖండ్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. టీచర్ చెంపదెబ్బ కొట్టిందన్న అవమానంతో ప్రాణాలు తీసుకుంది. బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు టీచర్‌ విద్యార్థినిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి నుంచి సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. టీచర్ టార్చర్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో రాసింది విద్యార్థిని. 


"ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. ఆమె దగ్గర ఓ సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నాం. స్కూల్‌లో టీచర్‌ వేధించడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసింది. ఈ నోట్ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశాం. తదుపరి విచారణ కొనసాగిస్తాం"


- పోలీసులు