హిమాచల్ ప్రదేశ్‌ లోన్ని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లాలోని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది.  ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


రానున్న మూడు గంటల్లో బిలాస్‌పూర్‌, హమీర్‌పూర్‌, కాంగ్రా, కులు, మండి , సిమ్లా, సిర్మౌర్‌, సోలన్‌, చంబా ఉనాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర తెలిపింది. 


సోలన్‌, సిమ్లా, సిర్మౌర్‌, కాంగ్రా , మండిలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. "చంబా , కాంగ్రా,  హమీర్‌పూర్ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


నదౌన్, సుజన్‌పూర్ తీరా,  సోలన్, సిర్మౌర్, సిమ్లా, బిలాస్‌పూర్, ఉనా , మండి, కులు, సోలన్ సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.  మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.