రాజకీయాల్లోపెరిగిపోతున్న విద్వేష వ్యాఖ్యలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల మధ్య విద్వేషాలను పెంచే హేట్ స్పీచ్‌లు ఇటీవల పెరిగిపోతున్నాయని వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. హేట్‌స్పీచ్‌ల విషయంలో విదేశాల్లో ఉన్న నియంత్రణ పద్దతులను అధ్యయనం చేయాలని.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనం చేసేందుకు చేసే పుకార్లు, ప్రచారాలను అడ్డుకునేందుకు స్పష్టమైన సూచనలతో సమాధానం ఇచ్చేలా చూడాలని పిటిషనర్ కోరారు.
మిత్రమా, మీ ఆతిథ్యానికి ఫిదా- నేను ఓ సచిన్, బిగ్ బీలా ఫీలయ్యా: బోరిస్
ఈ పిటిషన్‌పై విచారణలో విద్వేష వ్యాఖ్యల నివారణకు లా కమిషన్ ఇచ్చిన సిఫార్సుల అమలు గురిరించి జస్టిన్ ఖాన్విల్కర్ ప్రస్తావించారు. విద్వేష వ్యాఖ్యల నివారణకు గతంలోలా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషనర్ సిఫారసులు కూడా చేసింది. హేట్ స్పీచ్‌ల వల్ల హింసను నిరోధించడానికి ఇండియన్ పీనల్ కోడ్‌లో కొత్త సెక్షన్లు కలపడం వంటి సిఫార్సులు లా కమిషన్ రిపోర్టులో ఉన్నాయి. అయితే అమల్లోకి రాలేదు. ఈ సిఫార్సులపై కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. మే పదమూడో తేదీలోపు ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాలని సొలిసిటల్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
లాలూకి మళ్లీ లక్కీ ఛాన్స్! ఆ కేసులో బెయిల్ ఇచ్చిన కోర్టు
దేశంలో ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే రాజకీయాలకు ఎక్కువ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే రాజకీయ పార్టీల కార్యకర్తలూ అదే పనిగా సోషల్ మీడియాలోనూ.. హేట్ స్పీచ్‌లు ఇస్తున్నారు. ఇవన్నీ పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నాయి. వీటి నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో లా కమిషన్ రిపోర్టు ఇచ్చినా ఇంత వరకూ సిఫార్సుల్ని అంగీకరించలేదు.
యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?
విద్వేష వ్యాఖ్యల వల్ల దేశ ప్రజల మధ్య దూరం పెరుగుతోందన్న ఆందోళన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయం కోసం కొంత మందిని శత్రువులుగా ప్రచారం... వ్యతిరేకంగా విద్వేషాలు పెంచడం వల్ల సమాజంలో చీలక కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో హేట్ స్పీచ్ నిరోధానికి లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం నిర్ణయం కీలకం కానుంది. తదుపరి విచారణ మే పదమూడో తేదీ తర్వాత జరగనుంది.