Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

ABP Desam Updated at: 20 May 2022 05:33 PM (IST)
Edited By: Murali Krishna

Gyanvapi Mosque Row: జ్ఞానవాపి మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం ముస్లింలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

NEXT PREV

Gyanvapi Mosque Row: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న వేళ ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువైంది. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌ను పుర‌స్క‌రించుకొని ముస్లింలు పెద్ద ఎత్తున మసీదుకు తరలివచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా మసీదులోకి ప్రార్థనల నిమిత్తం 30 మందిని మాత్రమే అనుమతించాలని నిబంధనలు ఉన్నాయి. 






700 మంది


జ్ఞానవాపి మసీదు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ ఒక్క‌సారిగా 700 మంది వరకు ముస్లింలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు పెంచారు. మ‌సీదు గేట్ల‌ను పోలీసులు మూసేశారు. ఈ మ‌సీదు కాకుండా ప్రార్థ‌న‌ల కోసం మ‌రో మ‌సీదుకు వెళ్లాల‌ని పోలీసులు సూచించారు.


సుప్రీం ఆదేశాలు


జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.



ఈ అంశం సంక్లిష్టత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, వారణాసిలోని సివిల్ జడ్జి సమక్షంలో విచారణలో ఉన్న సివిల్ దావాను ఉత్తర ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్‌లోని సీనియర్, అనుభవజ్ఞుడైన జ్యుడిషియల్ ఆఫీసర్ విచారిస్తే బాగుంటుంది.                     - సుప్రీం కోర్టు


మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. 


ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ మసీదుని నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. 



Also Read: Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?





Published at: 20 May 2022 03:41 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.