Covid-19 Cases India: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,259 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,044గా ఉంది.






ఒక్కరోజే 2,614 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 98.75గా ఉంది. డైలీ పాజిటివీటి రేటు 0.50 శాతంగా నమోదైంది.


వ్యాక్సినేషన్







దేశవ్యాప్తంగా బుధవారం 15,12,766 మందికిపైగా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,91,96,32,518కు చేరింది. ఒక్కరోజే 4,51,179 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఔషధాలను అందించాలన్నారు. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కిమ్ దృష్టి పెట్టకపోవడం వల్లే అక్కడ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయని నిపుణులు అంటున్నారు.


Also Read: CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ



Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు