Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో సర్వేకి లైన్ క్లియర్, అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో ASI సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది.

Continues below advertisement

Gyanvapi Mosque Case: 

Continues below advertisement


సర్వే చేయాల్సిందే: అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్‌ హైకోర్టు అంగీకరించింది. ASI సర్వే చేయొచ్చని తీర్పునిచ్చింది. ఈ సర్వే చేయడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చిన న్యాయస్థానం...సర్వేకి అనుమతినిచ్చింది. నిజానికి జులై 21వ తేదీనే ASI సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అది మసీదా లేకపోతే ఆలయమా తేలాలంటే ఈ సర్వే చేయాల్సిందేనని ఓ మహిళ వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది. జులై 24న సర్వే మొదలైనా...మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కారణంగా స్టే విధించాల్సి వచ్చింది. ఈ సర్వే కారణంగా మసీదు నిర్మాణం పాక్షికంగా దెబ్బ తింటుందని, అక్కడ తవ్వడం వల్ల కూలిపోయే ప్రమాదమూ ఉందని వాదించింది మసీదు కమిటీ. అయినా ఇలాంటి ప్రాంతాల్లో సర్వే చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది Anjuman Intezamia Masjid Committee. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం...అంతకు ముందు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. న్యాయం జరగాలంటే కచ్చితంగా ఈ సర్వే జరపాల్సిందే అని స్ఫష్టం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన యూపీ డిప్యుటీ సీఎం కేశవ్ ప్రసాద్... ఈ తీర్పుతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Continues below advertisement