SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2023 ప్రక‌ట‌న‌ను ఆగస్టు 2న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.


వివరాలు..

* స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2023


ఖాళీల సంఖ్య: 1207 పోస్టులు


1) గేడ్-సి పోస్టులు: 93


2) గ్రేడ్-డి పోస్టులు: 1114

అర్హత‌: 23.08.2023 నాటికి ఇంట‌ర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.


వయోపరిమితి: 


➥ 01.08.2023 నాటికి స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు  02.08.1993 - 01.08.2005 మధ్య జన్మించి ఉండాలి.  ఇక స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.08.2023 - 02.08.1996 మధ్య జన్మించి ఉండాలి.


➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


➥ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


➥ వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) లేదా SBI చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక‌ విధానం: ఆన్‌లైన్ రాతప‌రీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా.


పరీక్ష విధానం...
✦ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
✦ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి.
✦ పరీక్ష సమయం 2 గంటలు. ప్రత్యేక అవసరాలుగల అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు.
✦ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3  చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.



సదరన్ రీజియన్‌లో ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మ‌హేంద్రవ‌రం, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, చెన్నై, కోయంబ‌త్తూరు, మ‌ధురై, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, పుదుచ్చేరి, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్.


స్కిల్ టెస్ట్:




ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23.08.2023 (23:00)


✦ ఆఫ్‌లైన్ చలనా జనరేషన్‌కు చివరితేదీ: 23.08.2023 (23:00)


✦ దరఖాస్తుల తప్పుల సవరణ తేదీ: 24.08.2023 - 25.08.2023 (23:00)


✦ ఆన్‌లైన్ రాతపరీక్ష: 2022, అక్టోబరులో. 


Notification


Online Application


ALSO READ:


సీజీఎల్ 2023 'టైర్-1' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...