Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.
మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది.
ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ మసీదుని నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.
వీడియోగ్రఫీ సర్వే
ఈ మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో పలు షాకింగ్ విషయాలు కమిటీ ప్రస్తావించినట్లు సమాచారం. జ్ఞానవాపి మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు మసీదులో ఆలయ అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. విగ్రహాల ముక్కలున్నాయని కోర్టుకు తెలిపింది.
నివేదికలో
- స్వస్తిక్, శేషనాగు గుర్తులు ఉన్నట్లు తెలిపిన కమిటీ
- శిలాఫలకాలపై కమలం పువ్వులు గుర్తింపు.
- సింధూర వర్ణంలో నాలుగు దేవాతాముర్తుల విగ్రహాల గుర్తింపు.
- శృంగార గౌరీదేవీ మాతా మందిరానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు కమిటీ నిర్ధారణ
మరోవైపు శివలింగం కనిపించినచోట తక్షణమే పూజలకు అనుమతించాలని కాశీ విశ్వ నాథ ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Also Read: Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?