Watch Video:
గుజరాత్‌లో భారీ వర్షాలు..
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఖేదా జిల్లాలోని ఓ అండర్‌పాస్‌లో నీళ్లు నిలిచిపోయి ఓ కాలేజ్ బస్ చిక్కుకుంది. చాలా సేపు సాయం కోసం చూసిన ఆ విద్యార్థుల్లో కొందరు ఎలాగోలా బయటకు వచ్చారు. వాళ్లే మిగతా విద్యార్థులకూ సాయం చేసి బస్‌లో నుంచి సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు అబ్బాయిలు బస్ పక్కన ఓ లేన్‌లో నిలబడి బస్‌లో ఉన్న వారికి చేయందించారు. బయటకు రావడానికి అంతకు మించి మార్గం కనిపించలేదని, కింద నీళ్లు నిలిచిపోవడం వల్ల ఇబ్బంది పడ్డామని స్టూడెంట్స్ చెప్పారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సింది పోయి కొందరు బైకర్స్ ఆ సందులో నుంచే వెళ్తూ కనిపించారు. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని గత వారమే IMD వెల్లడించింది. రాష్ట్రంలోని దహోద్, పంచ్‌మహల్, చోటా ఉదెపూర్, నర్మదా, దంగ్, తపి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సూరత్, వల్సాద్ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిశాయి. సౌరాష్ట్ర, పోర్‌బందర్, గిర్ సోమనాథ్, జునాగఢ్‌లోనూ ఇవే పరిస్థితులుంటాయని IMD అధికారులు వెల్లడించారు. వానల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు ఆనందంలో మునిగిపోయారు.