GST 50th Council:
50 జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం..
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 50వ GST కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని సర్వీస్‌లపై GSTలో మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, మల్టీప్లెక్స్‌లలో విక్రయించే ఆహారాలపై విధించే జీఎస్‌టీలో మార్పులు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్‌తో పాటు హార్స్ రేసింగ్, క్యాసినోపై 28% జీఎస్‌టీ విధించనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు మరి కొన్ని వస్తు, సేవలపై విధించే పన్నుని సవరించారు. ఈ కారణంగా...కొన్ని సేవల ధరలు తగ్గగా..మరి కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి.
ధర తగ్గినవేంటి..?
జీఎస్‌టీ కౌన్సిల్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్టీప్లెక్స్‌లలో విక్రయించే ఆహార పదార్థాలపై సర్వీస్ ట్యాక్స్‌ని 18% నుంచి 5%కి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సినీ అభిమానులకు ఇది గుడ్ న్యూసే. వందలు పోసి పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కొనాలంటేనే భయపడిపోతున్నారు. వాటిపై జీఎస్‌టీ తగ్గిస్తే చాలా వరకూ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఇక సినిమా టికెట్స్ విషయానికొస్తే..రూ.100లోపు టికెట్‌లపై 12% పన్ను విధిస్తున్నారు. అంత కన్నా ఎక్కువ ధర ఉన్న టికెట్స్‌పై 18% జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. ఈ రివైజ్డ్ రేట్‌లతో "వండని ఆహార పదార్థాలు", అన్ ఫ్రైడ్ స్నాక్స్ (unfried snacks) ధరలు తగ్గనున్నాయి. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం..క్యాన్సర్ ట్రీట్‌మెంట్ డ్రగ్స్‌తో పాటు అరుదైన వ్యాధులకు అందించే మందుల ధరలు, స్పెషల్ మెడికల్ పర్పస్‌లో తీసుకునే ఆహారంపై ఎలాంటి పన్ను విధించడం లేదు. అంటే అవి అసలు పన్ను పరిధిలోకే రావు. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారికి ఈ నిర్ణయంతో కొంత వరకూ ఉపశమనం కలగనుంది.
ధర పెరిగేవేంటి..?
ప్రస్తుతానికి అత్యధిక జీఎస్‌టీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది ఆన్‌లైన్ గేమ్స్‌పైనే. ఇప్పటికే ఈ ఇండస్ట్రీ ఎన్నో (Online Gaming Industry) లాభాలతో దూసుకుపోతోంది. అయితే...కొన్ని సార్లు వీటి ద్వారానే ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం అత్యధికంగా 28% జీఎస్‌టీ విధించింది. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF) మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. ఆటో రంగంపైనా ఈసారి ప్రభావం పడనుంది. SUV నిర్వచనాన్ని కూడా మార్చేశారు. 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న కార్‌లను మాత్రమే SUVలుగా పరిగణించనున్నారు. దీని ఆధారంగానే పన్ను విధించనున్నారు.
Also Read: ఇకపై రాహుల్ కూడా మనలా ఇంటి అద్దె కట్టాల్సిందే, ఆ కాంగ్రెస్ నేత ఇంటికి షిప్ట్!