Gleeden App Study On Indian Marriage Relationship : ప్రముఖ డేటింగ్‌ యాప్‌ గ్లీడెన్‌ నిర్వహించిన అధ్యయనం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయ సమాజం ఒక భార్య, ఒక భర్త విధానానికి కట్టుబడి ఉంటుంది. కానీ, ప్రాశ్చాత్య దేశాల అలవాట్లు భారతీయ సమాజంలోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు విషయంలో భారతీయులు ఫాస్ట్‌గా ఉంటున్నారన్న విషయాన్ని ఈ యాప్‌ పరిశోధనలో తేలింది. 60 శాతం మంది భారతీయులు వివాహేతర సంబంధాలు (లైంగిక సంబంధాలు/వర్చువల్‌ రిలేషన్స్‌) కోరుకుంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనం భారత్‌లో ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాహ సంబంధాలను సవాల్‌ చేసేలా ఉందన్న అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో వివాహిత పురుషుల ఆలోచన వైఖరిని మార్పునకు ఈ అధ్యయనం దోహదం చేస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా టైర్‌ 1, టైర్‌ 2 సిటీల్లో నివసించే 1503 మంది నుంచి సమాచారాన్ని సేకరించి అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన పురుషులు ఉన్నారు. 


వివాహం పట్ల మారుతున్న వైఖరి


భారతీయ సమాజంలో వివాహానికి ప్రత్యేక ఉంది. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరికి ఒకరు తోడు, నీడగా జీవిస్తారు. భర్తకు భార్య, భార్యకు భర్త తప్పా మరొకరితో సంబంధం ఉండదు. ఈ విధానమే భారతీయ వివాహ వ్యవస్థను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిపేలా చేసింది. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటూ కుటుంబ వ్యవస్థను అద్భుతంగా లీడ్‌ చేసే భారతీయుల్లో.. పెళ్లి అనే బంధంపై ఆలోచన మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న చాలా మంది వృత్తిపరమైన, ఇతర ఒత్తిళ్ల నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు, సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాలు వైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. ఏది ఏమైనా తాజా అధ్యయనం ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాలను తెలియజేస్తోంది. 46 శాతం మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఈ తరహా సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో 52 శాతం మంది కలకత్తాకు చెందిన వారు ఉన్నట్టు అధ్యయనం తేలింది. 


వర్చువల్‌ రిలేషన్స్‌


పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్‌ విధానంలో రిలేషన్స్‌ కొనసాగిస్తున్నారు. అంటే వీడియో కాల్స్‌ ద్వారా తమలోని కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిలో కొచ్చిన్‌ ప్రాంతానికి చెందిన వాళ్లు 35 శాతం మంది ఉన్నారు. 33 శాతం మంది పురుషులు జీవిత భాగస్వామి గురించి కాకుండా మరొకరితో సంబంధాలను గురించి కలలు కంటున్నట్టు తేలింది. ఈ తరహా ఆలోచనలు 35 శాతం మంది మహిళల్లోనూ ఉండడం గమనార్హం. జైపూర్‌లో ఈ తరహా ఆలోచనలు కలిగిన వాళ్లు 28 శాతం కాగా, లూథియానాలో 37 శాతం మంది ఉన్నారు. 


పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు


ఇప్పటి వరకు భారతీయ వివాహ బంధంలో ఉన్న గొప్పతనం గురించి తెలిసిన అందరికీ.. తాజా అధ్యయనంలో తేలిన అంశాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించక మానవు. ఈ అధ్యయనంపై గ్లీడెన్‌ కంట్రీ మేనేజర్‌ సిబిల్‌ షిడెల్‌ మాట్లాడుతూ "ఈ పరిశోధనలో భాగంగా అనేక విషయాలను తెలుసుకోగలిగాం. భారతదేశంలో మారుతున్న పరిస్థితులను ఈ అధ్యయనం వెల్లడించింది. భాగస్వామి గురించి కాకుండా మరొకరి గురించి ఆలోచించే విషయంలో పునరాలోచన చేయాలి, ఒంటరి కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.