SHRESHTA (NETS)-2024 Notification: కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ 2024' పథకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. 'శ్రేష్ఠ' పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల సీట్లను భర్తీ చేస్తారు. పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
➥ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ 2024
అర్హత: విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2023-24)లో 8, 10వ తరగతులు చదువుతుండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 2.5 లక్షలకు మించకూడదు.
వయోపరిమితి: 9వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 12-16 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2008 - 31.03.2012 మధ్య జన్మించి ఉండాలి. ఇక 11వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2006 - 31.03.2010 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు ఆధారంగా.
పరీక్ష విధానం..
* మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు, సైన్స్-20 ప్రశ్నలు, సోషల్ సైన్స్-25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్-25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.04.2024 (05:00 P.M.)
➥ దరఖాస్తుల సవరణ: 06.04.2024 - 08.04.2024 (05:00 P.M.)
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 12.05.2024 నుంచి.
➥ పరీక్ష తేదీ: 24.05.2024.
పరీక్ష సమయం: 02.00 PM to 05.00 PM (3 గంటలు)
➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 4 - 6 వారాల్లో.
ALSO READ:
AP KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2024-25 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన బాలికలకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీట్ల భర్తీకి మార్చి 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రారంభంకావాల్సి ఉంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సెలక్షన్ జాబితా ఏప్రిల్ 15 నాటికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్ చేసి.. ఏప్రిల్ 19న జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌లో సమాచారం ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు.
కేజీబీవీల్లో ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..