Healthy ways to Storage Boiled Eggs : ఉడకబెట్టిన కోడి గుడ్లు ఆరోగ్యకరమైన హెల్తీ లైఫ్​ స్టైల్​లో ఓ భాగమని చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాన్ని లో ఫ్యాట్ ఫుడ్స్​తో భర్తీ చేయాలంటే గుడ్లు మంచి ఆప్షన్. సమతుల్య భోజనం తీసుకునేవారు కూడా తమ డైట్​లో ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవచ్చు. అయితే సమ్మర్​లో గుడ్లతో ఒక సమస్య వస్తుంది. అదేంటంటే అవి త్వరగా పాడైపోతాయి. అందుకే కొందరు వాటిని ఉడకబెట్టి స్టోర్ చేసుకుంటారు. కానీ అలా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఎలా ఉడకబెడితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


గుడ్లు ఎలా ఉడకబెట్టాలంటే..


గుడ్లు ఉడకబెట్టడంలో కొందరు ఎప్పుడూ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కొందరు సరిగ్గా ఉడకముందే తీసేస్తే.. మరికొందరు బాగా ఎక్కువ ఉడికించేస్తారు. ఇలా చేయడం వల్ల గుడ్డులోని పోషకాలు మీకు సరిగ్గా అందవు. అందుకే వాటిని ఉడికించేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ గిన్నెలో గుడ్లు వేసి.. గుడ్లు పూర్తిగా ఒక అంగుళం లేదా రెండు అంగుళాలు మునిగిపోయేలా నీరు వేయాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. వాటిని ఉడకనివ్వండి. 


ఉడికించేప్పుడు గుడ్డు పగిలిపోతే..


గుడ్లు ఉడికించేప్పుడు మధ్యలో విరిగిపోతే.. గుడ్డులోని తెల్లసొన బయటకు రాకుండా ఉండేందుకు ఉడికించే నీటిలో ఒక టీస్పూన్ వెనిగర్ వేయాలి. గుడ్లను పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడకనివ్వాలి. అనంతరం వాటిని పాన్​ నుంచి తీసేసి.. చల్లని నీటిలో వేయాలి. వాటిని అలానే వేడినీటిలో ఉంచితే అవి మరింత ఉడికే అవకాశముంది. నీటిలో ఉండగానే గుడ్లపై ఉన్న షెల్​ను జాగ్రత్తగా తీయాలి.


ఉడికించిన గుడ్లు ఎంతకాలం తాజాగా ఉంటాయి?


ఉడకించిన గుడ్లు ఎన్నాళ్లు తాజాగా ఉంటాయి అంటే భిన్నమైన సమాధానాలు వినిపిస్తాయి. ఇంతకీ బాయిల్ చేసిన ఎగ్స్​ని ఎన్నాళ్లు స్టోర్ చేసి వాడుకోవచ్చు? ఉడికించిన గుడ్లను రూమ్ టెంపరేచర్​లో ఎక్కువసేపు ఉంచితే.. క్రిములు త్వరగా వృద్ధి చెందుతాయి. రెండు గంటలవరకు అవి మంచిగా ఉంటాయి. ఫ్రిజ్​లో ఉంచితే వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉండొచ్చు. వాటిని గట్టి కంటైనర్​లో ఉంచాలి. అవి స్మెల్ రాకుండా వాటిని ప్లాస్టిక్ ర్యాప్​తో కప్పితే మంచిగా ఉంటాయి. వారం తర్వాత వాటిలో ప్రోటీన్లు కోల్పోతాయి కాబట్టి వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. 


ఉడికించిన గుడ్లు చెడిపోయాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే.. 


ఉడికించిన గుడ్లు పాడైపోయాయి అనేది వాటి స్మెల్ చూసి చెప్పేయొచ్చు. వాటి నుంచి దుర్వాసన వస్తాయి. అలాంటి వాసన వస్తే గుడ్లు పాడైపోయాయని అర్థం. కాబట్టి గుడ్డు ఉడికించే ముందు స్మెల్ చూడడం అవసరం. గుడ్డు రంగు కూడా మారిపోతుంది. అయితే ఉడకబెట్టిన గుడ్లను స్టోర్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉడికించిన ఎగ్స్​ను చల్లని నీటితో నిండిన గిన్నెలో ఉంచవచ్చు. కానీ రోజూ ఆ నీటిని మార్చాలి. లేదంటే గాలి చేరని కంటైనర్​లో వెట్ క్లాత్స్​తో కలిపి గుడ్లు స్టోర్ చేయవచ్చు. 


Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో బెంగాలీ స్వీట్​పై మనసు పడేసుకున్న ఆలియా.. రెసిపీ ఇదే




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.