Nolen Gud Sandesh Recipe : ప్రెగ్నేన్సీ సమయంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదొక ఫుడ్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. తినేకొద్ది వాటిని తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయంటారు. ఆలియా భట్‌కి కూడా రాహా కపూర్ కడుపులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ స్వీట్‌ని తెగ తినేదంట. తాజాగా ఈ విషయాన్ని ఆమె డైటీషన్ బయటపెట్టారు. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి? దానిని ఎలా తయారు చేయాలి? నిజంగా ఆ స్వీట్ అంత మంచిగా ఉంటుందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రణ్‌బీర్ కపూర్‌ని ఆలియా ప్రేమించి కొన్నాళ్లు రిలేషన్లో ఉన్న తర్వాతా ఏప్రిల్ 2022న పెళ్లిచేసుకుంది. అదే సంవత్సరం వారు రాహాకు జన్మనిచ్చారు. ఆలియా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్రముఖ పోషకాహార నిపుణుడి దగ్గర తన డైట్ తీసుకునేవారు. అయితే తన తరచుగా బెంగాలీకి చెందిన స్వీట్ మాత్రం కావాలని అడిగేదంట. అదే నోలెన్ గుడ్ సందేశ్. పేరు వినడానికి వెరైటీగా ఉంది కదా.. కానీ ఇది తినడానికి చాలా బాగుంటుందట. మరీ ఈ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
క్రీమ్ పాలు - రెండున్నర లీటర్లు
చీజ్ - 500 గ్రాములు
వెనిగర్ -3 టేబుల్ స్పూన్లు
బెల్లం - 2 కప్పులు
నెయ్యి - అర టీస్పూన్
ఎండు ద్రాక్ష - 20
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి మందపాటి అడుగు కలిగిన పాన్‌ను స్టౌవ్ మీద ఉంచండి. దానిలో పాలను వేసి వేడి చేయండి. పాలు మరిగే సమయంలో మంటను తగ్గించి.. ఓ చెంచా వెనిగర్ వేసి పాలను నెమ్మదిగా కలపండి. ఇప్పుడు మంటను పెంచండి. పాలు వెనిగర్ వల్ల విరిగిపోతాయి. ఇప్పుడు స్టౌవ్‌ను ఆపేసి.. వాటిని చల్లారనివ్వండి. విరిగిపోయిన పాలు పూర్తిగా చల్లారిన తర్వాత.. వాటిని మస్లిన్ క్లాత్‌లో లేదా కాటన్ క్లాత్‌లో వేయాలి. ఇప్పుడు నీరు వెళ్లిపోతుంది.
పాల విరుగుడులోని వెనిగర్ రుచిని తొలగించడానికి.. దానిని చల్లని నీటితో కడగాలి. రెండు మూడు సార్లు కడిగితే వెనిగర్ రుచి పోతుంది. ఇప్పుడు పాలు పదార్థంలోని అదనపు నీటిని తొలగించాలి. వస్త్రాన్ని మూటగా కట్టి పిండితే.. దానిలో నీరంతా బయటకు పోతుంది. ఇంకేమైనా నీరు ఉంటే.. దానిని ఎక్కడైనా కట్టి ఓ అరగంట వేలాడదీస్తే దానిలోని నీరు పూర్తిగా బయటకు పోతుంది.
ఇప్పుడు చీజ్‌ని ఒక ప్లేట్లోకి తీసుకుని.. అరచేతితో మెత్తగా అయ్యేలా చేయాలి. అది మెత్తగా అయ్యేలోపు.. స్టౌవ్ వెలిగించి.. ఓ గిన్నె పెట్టి దానిలో తురిమిన బెల్లం వేయండి. దానిలో అరకప్పు నీటిని వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి. బెల్లం దానిలో కరిగిపోయే వరకు ఉంచండి.. ఇప్పుడు దానిని పక్కన ఉంచి చల్లారనివ్వండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని.. దానిలో మెత్తగా చేసుకున్న చీజ్‌ను వేసి.. దానిలో కరిగించిన బెల్లాన్ని వడకట్టండి. ఇప్పుడు మంటను తక్కువ చేసి.. నెమ్మదిగా కలుపుతూ ఉండండి. చీజ్‌లో బెల్లం కలిసి.. నూనెలాంటి మిశ్రమం.. వదిలేస్తున్నప్పుడు స్టౌవ్ ఆపేయాలి.
బెల్లం మిశ్రమాన్ని.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న విరిగిన పాలల్లో కలిపి మిక్స్ చేయాలి. దీనిని బ్లెండర్లో వేసి కలుపవచ్చు. లేదంటే చేతితో కూడా కలపవచ్చు. అంతే వేడి వేడి బెంగాలీ స్వీట్ రెడీ అయిపోయినట్లే. దీనిని మీకు నచ్చిన షేప్‌లలో తయారు చేసుకోవచ్చు. ఎండుద్రాక్షలతో దీనిని గార్నిష్ చేయవచ్చు. మీరు వాటిని వద్దు అనుకుంటే మానేయొచ్చు. ఎందుకంటే ఎండుద్రాక్ష పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బెంగాలీ రెసిపీని ఇంట్లో తయారు చేసుకుని ఆస్వాదించేయండి.
Also Read : హోటల్ స్టైల్ పూరీ కర్రీ.. ఈ సింపుల్ రెసిపీ మంచి టేస్ట్ ఇస్తుంది..