G20 Summit 2023:



యుద్ధంపై వాగ్వాదం..


రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో ఓ డ్రాఫ్ట్‌ని ప్రవేశపెట్టారు. చాలా చర్చల తరవాత ఓ జాయింట్ డిక్లరేషన్‌ని వెల్లడించారు. కానీ...ఈ విషయంలో పలు దేశాల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పశ్చిమ దేశాలన్నీ రష్యా చర్యల్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. చైనా మాత్రం రష్యాకు అనుకూలంగా మాట్లాడింది. తమపై వచ్చే ఆరోపణల్ని, విమర్శల్ని తిప్పికొట్టేందుకు రష్యా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భారత్‌ ఉక్రెయిన్‌ పరిస్థితికి సంబంధించి కొత్త డాక్యుమెంట్‌ని విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంట్‌లో వాడిన భాషపై పలు దేశాలు అభ్యంతరం తెలిపాయి. రష్యాకు మద్దతునిచ్చే దేశాలు ఓ విధంగా, ఉక్రెయిన్‌ని సపోర్ట్ చేసే దేశాలు మరో విధంగా వాదించాయి. చాలా సేపు దీనిపై వాగ్వాదం జరిగింది. చివరకు భారత్ చొరవ తీసుకుని కొత్త డాక్యుమెంట్‌ని తయారు చేసేందుకు అంగీకరించింది. ఢిల్లీ డిక్లరేషన్‌ పూర్తైందని ఇప్పటికే భారత్ G20 ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు. G20 లీడర్స్ అంతా కలిసి ఆమోదిస్తే వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 


కొత్త పేరా యాడ్ చేసిన భారత్..


అయితే...ఈ డిక్లరేషన్‌లో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రస్తావించిన "geopolitical situation"ని బ్లాంక్‌గా వదిలేశారు. అప్పటి నుంచి ఆయా దేశాల ప్రతినిధులు తీవ్రంగా చర్చించి చివరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. తరవాత భారత్ కొత్త పేరా జోడించింది. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అయితే...ఇండోనేషియాలో G20 సదస్సు జరిగినప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి తయారు చేసిన డిక్లరేషన్‌లో వాడిన భాషనే ఇందులోనూ వాడాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఆ డాక్యుమెంట్‌లో రష్యా ఆక్రమణని చాలా దేశాలు ఖండించాయి. మొత్తానికి జాయింట్ డిక్లరేషన్ లేకుండానే సమ్మిట్ ముగిసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా ఈ భేటీలో లేకపోవడం వల్ల ఈ డిక్లరేషన్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. 


అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు


రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో జరిగిన చర్చపై అమితాబ్ కాంత్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కోసం భారత్‌ బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇండోనేషియాతో భారత్‌ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ఇది భారత్‌కు అతి పెద్ద సవాలుగా నిలిచిందని, అయినా అధిగమించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిందని స్పష్టం చేశారు.