G20 Summit 2023: 



జీ 20 సదస్సు..


G20 Summit ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయి. అతిథులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు అధికారులు సిద్ధవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కొత్తగా 400 విద్యుత్ బస్‌లను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ బస్‌లకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గహ్లోట్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన FAME స్కీమ్‌లో భాగంగా 400 ఎలక్ట్రిక్ బస్‌లు ఢిల్లీలో సర్వీస్‌లు అందిస్తున్నాయి. ఇప్పుడు వీటికి మరో 400 బస్‌లు తోడవనున్నాయి. Delhi Transport Corporationలో దాదాపు 1,500 వరకూ ఎలక్ట్రిక్ బస్‌లను నడుపుకునేందుకు అనుమతి లభించింది. ఇందులో 921 బస్‌లు ఫేమ్ స్కీమ్‌ ద్వారానే అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి...క్రమంగా విద్యుత్ వాహనాల సంఖ్య పెంచాలన్నదే FAME II స్కీమ్ ఉద్దేశం. కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలాంటి నగరాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కేంద్రం. ఢిల్లీ ప్రజారవాణాలో 80% మేర విద్యుత్ వాహనాలే అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...G20 సదస్సు ఢిల్లీలోనే జరుగుతుండడం వల్ల వీలైనంత త్వరగా వీటిని నడపాలని చూస్తోంది. అందుకే...ఈ సమ్మిట్‌ కన్నా ముందుగానే వందలాది బస్‌లను ప్రారంభించనుంది. 


ముమ్మరంగా ఏర్పాట్లు..


G 20 సదస్సుకి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీలోని మున్సిపల్ పార్క్‌లో అతి పెద్ద థీమ్ లోగోతో పాటు జీ20లోని సభ్య దేశాల జాతీయ పతాకాలనూ ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా 20 స్తంభాలు అరేంజ్ చేశారు. గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని పార్క్‌ని ఇలా అలంకరించారు. సదస్సుకి వచ్చే అతిథులు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూడడమే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 9-10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని రోడ్లన్నీ అలంకరించారు. ఎక్కడా చెత్త కనబడకుండా క్లీన్ చేశారు. గోడలపై కొత్త పెయింట్స్ వేశారు. ఈ క్రమంలోనే పార్క్‌ని G 20 థీమ్‌తో అలంకరించారు. ప్రస్తుతం స్థానికులు ఈ పార్క్‌ని G 20 పార్క్‌గా పిలుస్తున్నారు.


"20 స్తంభాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాంక్రీట్ మిక్స్‌తో పాటు వుడెన్ టెక్ట్స్‌చర్‌తో వీటిని తయారు చేశాం. ప్రతి పిల్లర్‌పైనా G 20 దేశాల్లోని ప్రతి ఒక్క దేశానికీ ఓ జెండా అమర్చాం. ఇద్దరు ఆర్టిస్ట్‌లతో పాటు పది మంది కూలీలు ఇందుకోసం శ్రమించారు. ఈ పార్క్ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."


- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 


Also Read: మోదీపై యుద్ధం ప్రకటించిన I.N.D.I.A కూటమి, త్వరలోనే దేశవ్యాప్తంగా ర్యాలీలు