G20 Summit 2023: 


భారీ వర్షాలు..


ఢిల్లీని మరోసారి  భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు చోట్ల రోజ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ఈ ఎఫెక్ట్‌ G20 సదస్సుపైనా పడింది. ఈ సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపంలో వరద నీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ వీడియోలని పోస్ట్ చేస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రపతి విందుకి మల్లికార్జున్ ఖర్గేని ఆహ్వానించలేదన్న అసహనంతో ఉంది కాంగ్రెస్. బీజేపీతో మాటల యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో బయటకు రావడం రాజకీయంగా అలజడి పెంచింది. భారత్ మండపం నీళ్లతో నిండిపోయింది. వాటిని పంప్‌ల సాయంతో బయటకు పంపుతోంది అక్కడి సిబ్బంది. యూత్ కాంగ్రెస్ చీప్ బీవీ శ్రీనివాస్ కేంద్రంపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. అభివృద్ధి నీళ్లలో తేలుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సబ్‌కాత్ సాథ్, సబ్‌కా వికాస్‌పై ఇలా సెటైర్లు వేశారు.