Mumbai Fire Accident:


అగ్ని ప్రమాదం..


ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8 అంతస్తుల బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. కండివలిలో ఈ ప్రమాదం సంభవించింది. బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి చుట్టూ వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. 8 ఫైర్ ఇంజిన్‌లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. మంటల్లో చిక్కుకున్న వాళ్లని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మంటలు మొదటి అంతస్తుకే పరిమితమయ్యేలా చేయడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది...ఘటనపై విచారణ మొదలు పెట్టారు. ఎందుకు మంటలు వ్యాపించాయన్నది ఇంకా స్పష్టత రాలేదు. 






మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్‌లో మంటలు వ్యాపించినట్టుగా సమాచారం అందినట్టు వివరించారు. చాలా సేపు శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. 


 






బెంగళూరులోని కోరమంగళలో ఓ మల్టీస్టోర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం (Koramangala Fire Accident) సంభవించింది. ముందుగా ఓ కేఫ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోకి మంటలు వ్యాప్తి చెందాయి. ఆ తరవాత పేలుడు కూడా సంభవించింది. బిల్డింగ్‌లోని వాళ్లంతా గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. బిల్డింగ్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంట ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక వివరాల ప్రకారం...బిల్డింగ్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడినప్పటికీ కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. చెట్టుమీద పడడం వల్ల గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Viral Video: పార్క్ చేసిన BMW కార్‌లో నుంచి రూ.14 లక్షల చోరీ, వీడియో వైరల్