Arun Goel Resigns: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

Election Commissioner Arun Goel Resigns: భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Continues below advertisement

న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇప్పుడు కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

Continues below advertisement

2022 నవంబర్ లో బాధ్యతలు
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అరుణ్‌ గోయల్‌‌ 2022 నవంబర్ లో నియమితులయ్యారు. 1985 పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అరుణ్ గోయల్. వాస్తవానికి ఆయన నియామకానికి 6 నెలల నుంచి ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్ 19న అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే కొంతకాలం కిందటే రిటైర్ కావడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మరోవైపు 2027 వరకు పదీకాలం ఉన్నప్పటికీ మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం, రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్నికల కమిషనర్లను నియమించనుందని తెలుస్తోంది.

Continues below advertisement