Mizoram Assembly Election Results: ఎన్నికల కౌంటింగ్ (Election Counting)కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పార్టీల భవిష్యత్తు ఏంటో రేపు ఆదివారం తేలనుంది. తెలంగాణ (Telangana), రాజస్థాన్ (Rajasthan Elections 2023), మధ్యప్రదశ్ (Madhya Pradesh Elections 2023), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh Election 2023), మిజోరాం (Mizoram Elections 2023)లో ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గెలుపు ఓటములపై ఇప్పటికే ఓ రేంజ్‌లో బెట్టింగ్‌లు ఓ రేంజ్లో నడుస్తున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) తాజాగా ఎన్నికల ఫలితాల (Election Results)ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అన్ని రాష్ట్రాలల్లో కాదు. కేవలం మిజోరాంలో వాయిదా వస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మిజోరాంలో ఎన్నికలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదివారం కౌంటింగ్ నిర్వహించి ఫలితలు వెల్లడించేలా అధికారుల ఏర్పాట్లు చేశారు. అయితే మిజోరంలో కౌంటింగ్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ఒకరోజు వాయిదా వేసింది. సోమవారం రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనుంది.
అదే కారణమా?
మిజోరంలో క్రిస్టియన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదివారం రోజుకు అక్కడి ప్రజలు ప్రాముఖ్యతనిస్తారు. ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున చర్చికి వెళ్తారు. అంతే కాకుండా మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని కోరుతూ నిన్న అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టారు. మిజోరం ఎన్జీఓ కోఆర్డినేషన్ కమిటీ, సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిరాలై పాల్ వంటి విద్యార్థి సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి.
అంతే కాదు డిసెంబర్ 3 ఆదివారం నుంచి కౌంటింగ్ తేదీని మార్చాలని ఎన్జీవోసీసీ చాలాసార్లు ఈసీకి విజ్ఞప్తి చేసింది. మిజోరం ప్రజల విజ్ఞప్తికి ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. కౌంటింగ్ తేదీని ఆదివారం నుంచి సోమవారానికి మార్చింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో మాత్రం ఆదివారం యథావిథిగా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.
మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 7న పోలింగ్ జరిగింది. 80 శాతం కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 3 ఆదివారం ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే ప్రజల వినతి నేపథ్యంలో ఫలితాల ప్రకటనను సోమవారానికి వాయిదా వేసింది.
ఎగ్జిట్ ఫలితాలు
మిజోరాం ఎగ్జిట్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది.
40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్‌ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు.
జన్ కీ బాత్: ఎంఎన్ఎఫ్ 10-14, జెడ్‌పీఎం 15-25, కాంగ్రెస్ 5-9, బీజేపీ 0-2
ఇండియా టీవీ: ఎంఎన్ఎఫ్ 14-18, జెడ్‌పీఎం 12-16, కాంగ్రెస్ 8-10, బీజేపీ 0-2