Election Commission: రాజకీయ పార్టీలకు ఆదాయం వచ్చే మార్గాల్లో ఒకటైన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ఎస్బీఐను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించగా.. తాజాగా ఈసీ ఆ వివరాలను బహిర్గతం చేసింది. ఎస్‌బీఐ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తమ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. 


2019 నుంచి 2024 వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి అత్యధికంగా విరాళాలు అందాయని ఆ వివరాల ద్వారా అర్థం అవుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన సహా దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు భారీగా అందిన విరాళాలు అందినట్లుగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాల ద్వారా తెలుస్తోంది.


ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు, ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో ఇక్కడ తెలుసుకోండి


ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్