By Poll Notification: రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల ఎన్నిక కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీరిలో 10 మంది రాజ్యసభ సభ్యులు గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడం వల్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొత్తం 12 లో తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరగబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఇటీవల ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా జూలై 5న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది.


ఈ నెల 14 నుంచి 21 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సెప్టెంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.