Earthquake in Gujarat: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని భారతీయ భూకంప శాస్త్ర పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఎవరూ గాయపడలేదు, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా విపత్తుల నివారణ అధికారి తెలిపారు. గాంధీనగర్‌లోని ఐఎస్ఆర్ ప్రకారం, సాయంత్రం 6.55 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీని కేంద్రం జిల్లాలోని భచౌ నుంచి 12 కిలోమీటర్ల  దూరంలో ఉంది.

ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు. కచ్ జిల్లా అత్యధిక ప్రమాదకరమైన భూకంప ప్రాంతంలో ఉంది, తరచుగా తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.

24 ఏళ్ల క్రితం 6.9 తీవ్రతతో భూకంపం 

2001 జనవరి 26న గుజరాత్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కచ్‌లోని భచౌ సమీపంలో ఉంది. జిఎస్‌డిఎంఏ గణాంకాల ప్రకారం, ఈ భూకంపం కచ్‌తో సహా రాష్ట్రమంతా ప్రభావితం చేసింది. గుజరాత్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 13,800 మంది మరణించగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు.

గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (జిఎస్‌డిఎంఏ) గణాంకాల ప్రకారం, గత 200 సంవత్సరాలలో రాష్ట్రంలో తొమ్మిది పెద్ద భూకంపాలు సంభవించాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాలలో భారతదేశంలో మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసకరమైన భూకంపం.