US Tariffs On India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం పన్నులు నేడు అమల్లోకి వచ్చాయి. ఇదివరకే భారత్ మీద 25 శాతం పన్నులు విధించగా, అదనంగా విధించిన 25 శాతం టారిఫ్ బుధవారం (ఆగస్టు 27) నుంచి అమలులోకి రానుంది. ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే భారతదేశంపై 25 శాతం అదనపు పన్ను విధించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసిన కారణంగా అదనపు పన్ను విధించారు, దీనిని కేంద్ర ప్రభుత్వం పదేపదే తప్పుపట్టింది. వైట్ హౌస్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది భారతదేశంపై, మన మార్కెట్లపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు.
ఐఏఎన్ఎస్ ప్రకారం బలమైన దేశీయ డిమాండ్ కారణంగా 50 శాతం టారిఫ్ భారతదేశంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. కార్మిక-ఆధారిత వస్త్రాలు, రత్నాలు, ఆభరణాల రంగంపై కొంత ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పన్నులు, బలమైన స్వదేశీ డిమాండ్ కారణంగా ఫార్మాస్యూటికల్స్, స్మార్ట్‌ఫోన్లు, ఉక్కు పరిశ్రమలు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి.
కొత్త పన్ను విధానం.. ముఖ్యమైన విషయాలు
- అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ముసాయిదా నోటీసు ప్రకారం, ఆగస్టు 27, 2025 రాత్రి 12.01 గంటలకు కొత్త పన్ను విధానం అమలులోకి వస్తుంది. ఇప్పుడు భారతదేశం నుండి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై అమెరికా ఎక్కువ పన్ను విధించింది.
- అమెరికా 50% టారిఫ్ నిర్ణయం తీసుకున్న తర్వాత, భారతీయ ఎగుమతిదారులు ఆర్డర్‌లలో తగ్గుదల నమోదవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే, రాయిటర్స్‌తో మాట్లాడిన ఒక అధికారి, అటువంటి ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు భారతీయ ఎగుమతిదారులు చైనా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ వంటి మార్కెట్లలో అవకాశాలను వెతుక్కుంటున్నారు.
- సోమవారం (ఆగస్టు 25)న అహ్మదాబాద్‌లో అమెరికా విధించిన పన్నులను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. రైతులు, పాడి రంగం, చిన్న పరిశ్రమల ప్రయోజనాలు తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
- ప్రధాని మోదీ మంగళవారం (ఆగస్టు 26)న గుజరాత్‌లో స్వదేశీతయ, ఆత్మనిర్భర్ భారత్ గురించి నొక్కిచెప్పారు. ఎవరి డబ్బు అయినా, అది డాలర్ అయినా లేదా పౌండ్ అయినా, లేదా అది ఎక్కడి నుండి వచ్చినా మాకు సమస్య లేదు. దాని శ్రమ భారతీయుడిదై ఉండాలి. ప్రయోజనాలు మనమే పొందాలి"
- పలు నెలల పాటు కొనసాగిన ఐదు రౌండ్ల వాణిజ్య చర్చల తర్వాత అమెరికా విధించిన సుంకాలు అమలులోకి వస్తున్నాయి, ఇందులో రెండు పక్షాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ఓ క్లారిటీకి రాలేదు.
- ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం, సుంకాల పెంపు వల్ల కలగే ఆర్థిక ప్రభావంతో భారతదేశం మార్కెట్ పరిమాణం ద్వారా తగ్గుతుంది
- రసాయనాలు, ఆటోమొబైల్స్, ఆహారం, పానీయాల ఎగుమతులు సర్దుబాటు పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుందని నివేదిక పేర్కొంది.
- భారతదేశానికి అతిపెద్ద వస్త్రాల ఎగుమతి గమ్యస్థానంగా అమెరికా ఉండేది. చైనా, వియత్నాం తర్వాత, భారతదేశం అమెరికాకు మూడవ అతిపెద్ద ఎగుమతిదారు, మన వాటా 9 శాతం.
- గత 5 సంవత్సరాలలో, భారతదేశం అమెరికాలో తన మార్కెట్ వాటాను పెంచుకుంది. ఇది 6 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. అదే సమయంలో చైనా వాటా 38 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది.
- భారతదేశం దేశీయ మార్కెట్ చాలా పెద్దది. బయట డిమాండ్‌పై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ నుంచి దేశంలోనే పెరుగుతున్న డిమాండ్ ద్వారా అదిగమించవచ్చు