Himachal Pradesh destruction:  హిమాచల్ ప్రదేశ్‌లో  ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వరుసగా క్లౌడ్ బరస్టులు, కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలతో హిమాచల్ అంతా వణికిపోతోంది.  మండి, కుల్లూ, కిన్నౌర్, కాంగ్రా జిల్లాలు పూర్తిగా స్తంభించిపోయాయి.  గస్టు 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  జూన్ 20 నుండి ఆగస్టు 25 వరకు మొత్తం 184 మంది మరణించారు. మరో 36 మంది కనిపించకుడా పోయారు.  

హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ రహదారులన్నీ దాదాపుగా మూసివేశారు.  ప్రస్తుతం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.  

మనాలిలో, ఐకానిక్ షేర్-ఎ-పంజాబ్ రెస్టారెంట్ బలమైన వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. భవనంలో ఎక్కువ భాగం కొట్టుకుపోయింది, ముందు గేటు గోడ మాత్రమే మిగిలి ఉంది. 

 నది ఒడ్డున ఉండే భవనాలు అన్నీ నదిలో కలసిపోతున్న దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి.  

48 గంటల పాటు కురుస్తున్న వర్షాల తర్వాత, పండో ఆనకట్ట నుండి నీరు విడుదలవుతోంది .  తీవ్రత భారీగా ఉంది. హిమాచల్ అంతటా అనేక రోడ్లు మూసుకుపోయాయి, చండీగఢ్ మనాలి హైవే పూర్తిగా మూసివేశారు.   

మాధోపూర్ హెడ్‌వర్క్స్ వద్ద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది, వంతెనలు పొంగిపొర్లుతున్నాయి.   ఈ వరదలు 9,000 గ్రామాలను ముంచెత్తాయి మరియు 3.4 మిలియన్ల మందిని నిరాశ్రయులను చేశాయి. భారీ హిమాచల్ వర్షాలు సట్లెజ్, బియాస్ & ఘగ్గర్ నదులను ముంచెత్తడంతో, పంజాబ్ వరద ముప్పును ఎదుర్కొంటోంది.  

 నెలాఖరు వరకూ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో.. హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.