Kashi Vishwanath Temple: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి వాగ్వాదం జరిగంది. ఈ వాగ్వాదం చివరకి కొట్టుకునే స్థాయి వరకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
శనివారం సాయంత్రం గర్భగుడిలో శివుడికి హారతి ఇస్తున్నారు. ఆ సమయంలో తలుపులు మూసివేస్తుండగా ఇద్దరు భక్తులు దర్శనం చేసుకుంటామని పట్టుబట్టారు. దీంతో ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వారితో దురుసుగా ప్రవర్తించారు.
మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు.
ఈ లేఖలో తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు కూడా నిర్వహకులపై మండిపడుతున్నారు.
ఇటీవలే
శ్రావణ మాసం మొదటి సోమవారం (జులై 18న) కాశీ విశ్వనాథుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. శివునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: Viral News: బార్‌లో రెచ్చిపోయిన మహిళలు- చావగొట్టి, చెవులు మూశేశారు!
Also Read: Meghalaya: BJP నేత ఫాంహౌస్‌లో సెక్స్ రాకెట్- 73 మంది అరెస్ట్!