Devendra Fadnavis Exclusive: 'నా నీరు తగ్గుముఖం పట్టిందని నా ఒడ్డున ఇల్లు కట్టుకోకు ఎందుకంటే నేను మహాసముద్రాన్ని, తప్పకుండా తిరిగి వస్తాను.' అని 2019లో చెప్పినట్టుగానే ఐదేళ్లలోనే మళ్లీ అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నారు దేవంద్ర ఫడ్నవీస్‌.  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌. మహారాష్ట్రలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ ABP న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ప్రత్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే తనకు పోరాడే ధైర్యం వచ్చిందని అన్నారు.


దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, "నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు నన్ను, నా కుటుంబాన్ని, నా పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. వారి ప్రవర్తనను మహారాష్ట్ర ప్రజలు ఇష్టపడలేదు. నేను 2022వ సంవత్సరం ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు వారు నాతో అలా వ్యవహరించినందుకు ఈ రోజు వారంతా సిగ్గుపడాలి. అందుకే నేను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పాను. కానీ  వారందర్నీ నేను క్షమించేస్తున్నాను. 


దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిన ఘనత ఎవరిది?


ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించామని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన విజయ క్రెడిట్‌ను మొదట మహారాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మాకు భారీ మెజారిటీని అందించిన ప్రజలు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఏక్ హైతో సేఫ్ హై’ అనే నినాదాన్ని ఇచ్చారని, ఈ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారని అన్నారు.


రెండున్నరేళ్లలో మహాయుతి ప్రభుత్వం చేసిన పని మహారాష్ట్ర ప్రజలకు నచ్చిందని, లాడ్లీ బెహనా యోజన మహిళల్లో సానుకూలతను సృష్టించిందన్నారు. రైతులు, యువత కోసం ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చిందని మహారాష్ట్ర సీఎం అన్నారు. విద్యార్థుల కోసం, బాలికల కోసం తీసుకొచ్చిన పథకాలు మహాయుతికి ప్రయోజనం చేకూర్చిందన్నారు. ఇది మహారాష్ట్రలో మహాయుతికి అనుకూల వాతావరణం సృష్టించింది అన్నారు. 


'ఎన్నికల్లో ఓడిపోవడం గుణపాఠం నేర్పుతుంది' - దేవేంద్ర ఫడ్నవీస్


దేవేంద్ర ఫడ్నవీస్ తన పదేళ్ల ప్రయాణంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ ప్రయాణాన్ని 'రోలర్ కోస్టర్ రైడ్'గా అభివర్ణించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. 'బీజేపీలో ఎన్నికల్లో గెలవడం టీమ్‌ వర్క్‌ అని, ఓటమిని 'పాఠం' అంటారని, 2014తో పోల్చుకుంటే ఇప్పుడు పరిణితి చెందానని, ఎన్నో షాక్‌లను తట్టుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. "పరిస్థితిలో ఎలా స్పందించాలో నేర్చుకుంటాను, ఇప్పుడు నేను మారిపోయాను మరింత మెరుగుపడ్డాను." అని చెప్పుకొచ‌్చారు. 


హిందుత్వ ఎజెండాపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందన 


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను 'హిందుత్వ ఎజెండా'తో బీజేపీ లాభపడిందా? ఇది మహారాష్ట్రలో గెలుపునకు దారితీసిందా? దీనిపై సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో హిందూత్వ ప్రభావం ఉందని, అయితే దానిని పోలరైజేషన్ అనలేమని.. ఇది కౌంటర్ పోలరైజేషన్ అని అన్నారు.


MVA, సజ్జాద్ నోమాని గురించి ప్రస్తావిస్తూ, దేవేంద్ర ఫడ్నవిస్ ఇలా అన్నారు... "MVA, సజ్జాద్ నోమాని వంటి వ్యక్తులతో వ్యవహరించిన విధానం, ఇక్కడ జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న ముస్లింలను విడుదల చేస్తామని అంగీకరించారు. అటువంటి 17 డిమాండ్లు సజ్జాద్ నోమానీ చేశారు. వీటిని MVA అంగీకరించింది. లోక్‌సభలో జరిగినట్టు జరుగుతుందని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారు.


'హిందూత్వం, అభివృద్ధి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు'


దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, "మీరు ఒకరిని అణచివేసినప్పుడు, ఆ వ్యక్తి మరింత శక్తితో పైకి లేస్తాడు. మహారాష్ట్ర, దేశంలోని హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు ఇలానే ప్రయత్నాలు జరిగాయి. ప్రజలు దానికి స్పందించారు. అందుకు తగ్గట్టుగానే మేం మాట్లాడు. దీంతో ఇది వేగంగా పని చేసే ప్రభుత్వంగా ప్రజలు ఆలోచించారు. హిందుత్వ, అభివృద్ధి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒకరి ఆరాధన విధానం భిన్నంగా ఉండవచ్చు. వీరంతా ఏదో అరబ్ ప్రాంతం నుంచి వచ్చిన ముస్లింలు కాదు, వచ్చిన వారు వెళ్లిపోయారు. వీరు భారతీయులే. పూర్వాశ్రమంలో హిందువులు.