Delhi Air Pollution:
తగ్గని తీవ్రత..
ఢిల్లీలో కాలుష్య (Delhi Air Pollution) తీవ్రత తగ్గడం లేదు. వాయు నాణ్యత (Delhi Air Quality) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆప్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్‌ని బంద్ చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇంకా వాతావరణం ప్రమాదకరంగానే ఉండడం వల్ల మరో నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10వ తేదీ వరకూ అన్ని పాఠశాలల్నీ మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విటర్‌లో అధికారికంగా ఈ ప్రకటన చేశారు.
"ఢిల్లీ వ్యాప్తంగా కాలుష్య స్థాయి పెరుగుతోంది. ఇది దృష్టిలో ఉంచుకుని నవంబర్ 10వ తేదీ వరకూ అన్ని పాఠశాలల్నీ మూసేయాలని నిర్ణయించుకున్నాం. 6-12 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం"
- అతిశి, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి
అక్టోబర్ 4 లెక్కల ప్రకారం ఢిల్లీలో వాయు నాణ్యత "severe" కేటగిరీలోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం (అక్టోబర్ 5) 7 గంటల సమయానికి AQI 460గా నమోదైంది. నోయిడా, గుడ్‌గావ్‌లో పరిస్థితులు మరీ దిగజారిపోతున్నాయి. ఇప్పటికే పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai)స్పందించారు. నిర్మాణ పనులు తక్షణమే ఆపేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న వాతావరణానికి తోడు నిర్మాణ పనులు కొనసాగితే మరింత ప్రమాదకరం అని హెచ్చరించారు.