Dalai Lama J&K Visit: ఆధ్యాత్మిక గురువు దలై లామా గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లలో ఆయన పర్యటిస్తారు. దాదాపు రెండేళ్ల తర్వాత దలై లామా చేస్తోన్న తొలి అధికారిక పర్యటన ఇది.
ఈ సందర్భంగా దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రజలు తననెప్పుడూ ఓ వేర్పాటువాదిగా చూడలేదన్నారు. అయితే తాను టిబెటియన్ బుద్ధిజం సంప్రదాయాన్ని కాపాడాలని మాత్రమే పోరాటం చేస్తున్నానన్నారు.
కీలక వేళ
కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు ధర్మశాలలోని బౌద్ధాశ్రమానికే ఆయన పరిమితమయ్యారు. అయితే తాజాగా కశ్మీర్‌లోని తిక్సే మఠాన్ని ఆయన సందర్శించనున్నారని సమాచారం.
భారత్- చైనా మధ్య 16వ కార్ప్స్ కమాండెర్ స్థాయి సమావేశాలు జులై 17న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీకి మూడు రోజుల ముందు దలైలామా జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యంగా మారింది. కాగా దలైలామా పర్యటనపై చైనా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇటీవల
దలై లామా ఇటీవల 87వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలపడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చేందుకు టిబెబ్ సమస్యను ఉపయోగించడం మానేయాలని డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: Amarnath Yatra Suspended: అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేకులు- ఇదే కారణం!
Also Read: Bihar Terror Module: ప్రధాని మోదీ లక్ష్యంగా భారీ ఉగ్రకుట్ర- ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్