Amarnath Yatra Suspended: అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేకులు పడ్డాయి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మరోసారి యాత్రను నిలిపివేశారు. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరోసారి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గేవరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు సమాచారం ఇచ్చారు.
అధిక వర్షాల కారణంగా జులై 5, జులై 8న ఇప్పటికే రెండు సార్లు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
విషాదం
మరోవైపు అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డు దాటుతున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.
వీరందరినీ అనంతనాగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. మొత్తం 40 మంది యాత్రికులతో బస్సు.. బల్తాల్ బేస్ క్యాంప్వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో ఇటీవల జరిగిన తీవ్ర విషాదం నెలకొంది. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ వద్ద భారీ వరద ముంచెత్తింది. ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వరద నీరు దూసుకువచ్చింది.
గుహకు సమీపంలోని యాత్రికుల టెంట్లను చుట్టుముట్టింది. అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది.
Also Read: Bihar Terror Module: ప్రధాని మోదీ లక్ష్యంగా భారీ ఉగ్రకుట్ర- ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
Also Read: CM Stalin Hospitalized: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్- రెండు రోజుల క్రితం కరోనా!