Cyclone Biparjoy:


పలు చోట్ల రెడ్ అలెర్ట్..


బిపార్‌జాయ్ తుపాను ప్రభావం రాజస్థాన్‌పై గట్టిగానే కనిపిస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జాలోర్, బర్మేర్ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు IMD వెల్లడించింది. క్రమంగా రాజస్థాన్‌కి ఈశాన్య దిశగా తుపాను కదులుతున్నట్టు స్పష్టం చేసింది. జూన్ 16న అర్ధరాత్రి గుజరాత్‌ నుంచి రాజస్థాన్‌వైపు దూసుకొచ్చింది బిపార్‌జాయ్. అప్పటి నుంచి అక్కడ పలు చోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉన్నట్టుండి భారీ వర్షాలూ మొదలయ్యాయి. బర్మేర్‌లో అయితే భారీ వానలకు వరదలు పోటెత్తుతున్నాయి. చాలా వరకూ ఇళ్లు నీట మునిగాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాలోర్‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. సిరోహి, బికనీర్, జోధ్‌పూర్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 16 సాయంత్రం నాటికి సిరోహిలో 37.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాలోర్‌లో 36 మిల్లీమీటర్లు, బర్మేర్‌లో 33.6 మిల్లీమీటర్లు, బికనీర్‌లో 26.6 మిల్లీమీటర్లు, దబోక్‌లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బర్మేర్, జాలోర్, సిరోహి ప్రాంతాల్లో IMD రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరి కొద్ది గంటల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. పలి, జోధ్‌పూర్‌ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. జైసల్మేర్, బికనీర్, చురు,  సికార్ తదితర ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.