Cyclone Asani : ఈ ఏడాది తొలి తుపాను 'అసమి' మార్చి 21న బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో అసమి తుపాను(Cyclone) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ తుపాను భారత భూభాగాన్ని ప్రభావితం చేసే అవకాశం లేదని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులను(Andaman Nicobar Island) దాటిన తర్వాత మార్చి 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం, బుధవారం మధ్య దక్షిణ బంగాళాఖాతం మీదుగా సాగనుంది. అనంతరం మార్చి 19 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ మీదుగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అనంతరం నికోబార్‌ దీవులు మీదుగా ప్రయాణించి మార్చి 20 నాటికి అల్పపీడనంగా మారి, మార్చి 21వ తేదీన అసని తుపానుగా మారనుంది. 






అసని తుపాను


"అసని తుపాను మార్చి 20 ఉదయం నాటికి అల్పపీడనంగా, మార్చి 21న తుపానుగా మారుతుంది. ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి మార్చి 22న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకుంటుంది" అని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపానుగా మారిన తర్వాత దీనిని అసని అని పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక సూచించింది. అండమాన్, నికోబార్ దీవులలో ఆదివారం బలమైన గాలులు వీస్తాయని గంటకు 70-80 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం గంటకు 90 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 


మత్స్యకారులకు అలెర్ట్ 


గురు, శుక్రవారాల్లో ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ అండమాన్‌ ను ఆనుకుని సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు బుధవారం, గురు, శుక్రవారాల్లో దక్షిణ బంగాళాఖాతం, ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.  అండమాన్, నికోబార్ దీవుల వెంబడి, అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఐఎండీ సూచించింది. కేంద్ర హోం కార్యదర్శి.. రెస్క్యూ ఏజెన్సీలను సంసిద్ధతంగా ఉండాలని సూచించింది. రాబోయే తుపాను దృష్ట్యా అండమాన్, నికోబార్ అధికారులతో కేంద్ర హోం కార్యదర్శి మాట్లాడారు. 


పోర్ట్ బ్లెయిర్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం 


"పోర్ట్ బ్లెయిర్‌లో ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఉంది. అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయి, అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అండమాన్ & నికోబార్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర సామాగ్రి, జనాభాను రక్షించడానికి, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలతో సిద్ధంగా ఉంది" అని హోం మంత్రిత్వ శాఖ చెప్పిందని ANI తెలిపింది.