ABP  WhatsApp

Supreme Court: 'ఆ కూతుళ్లకు తండ్రి ఆస్తిపై హక్కు లేదు'- విడాకుల కేసులో సుప్రీం సంచలన తీర్పు

ABP Desam Updated at: 17 Mar 2022 04:25 PM (IST)
Edited By: Murali Krishna

తండ్రితో ఎలాంటి సంబంధం వద్దు అనుకునే కూతురికి.. ఆయన ఆస్తిపై హక్కు లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

'ఆ కూతుళ్లకు తండ్రి ఆస్తిపై హక్కు లేదు'- విడాకుల కేసులో సుప్రీం సంచలన తీర్పు

NEXT PREV

తండ్రితో ఎలాంటి సంబంధం వద్దనుకునే కూతుళ్లకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అలాంటి కూతుళ్లకు తండ్రి ఆస్తిపై ఎలాంటి హక్కులేదని తేల్చిచెప్పింది. తమ చదువు లేదా పెళ్లి కోసం తండ్రిని డబ్బు కోరే హక్కు ఉండదని ఓ కేసులో తీర్పు ఇచ్చింది.


జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ విడాకుల పిటిషన్‌ విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.



ఆ యువతి తన తండ్రితో ఎలాంటి సంబంధాలు కొనసాగించేందుకు సుముఖత చూపడం లేదు. ప్రస్తుతం యువతికి 20 ఏళ్లు. ఆమె చదువు, పెళ్లికి అయ్యే ఖర్చు విషయం కూడా మనం ఆలోచించాలి. తండ్రితో సంబంధం వద్దు అనుకునే కూతురికి అదే నాన్న డబ్బుపై కూడా ఎలాంటి హక్కు ఉండదు. చదువు, పెళ్లి కోసం తండ్రిని డబ్బు అడిగే అవకాశం లేదు.                                                                  -  సుప్రీం కోర్టు 


అయితే ఆ యువతికి కాకుండా ఆమె తల్లికి భరణం కింద ఒకేసారి కొంత డబ్బును ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఆ డబ్బును తన కూతరు చదువు కోసం తల్లి వినియోగించుకోవచ్చని తెలిపింది.


ఇదే కేసు


ఓ వ్యక్తి తన దాంపత్య హక్కులు పరిరక్షించాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అనంతరం విడాకులు ఇప్పించాలని మరో పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు వారికి విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును ఆయన భార్య పంజాబ్, హరియాణా హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది.. దీంతో ఆయన.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.


ఆ దంపతులకు ఓ కూతురు ఉండటంతో సుప్రీం కోర్టు మీడియేషన్ సెంటర్.. ఇరువురిని కలిపేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కూతురు చిన్నప్పటి నుంచి తల్లి వద్దే ఉంది. ఆమెకు ప్రస్తుతం 20 ఏళ్లు. తన తండ్రిని చూసేందుకు కూడా ఆమె ఇష్టపడ లేదు.


దీంతో సుప్రీం కోర్టు వారికి విడాకులు ఇచ్చింది. అయితే తన తండ్రి ఆస్తిపై కూతురుకు ఎలాంటి హక్కు లేదని తెలిపింది. కానీ విడాకులు ఇచ్చినందు వల్ల నెలకు 8 వేలు తన భార్యకు భరణంగా ఇవ్వాలని కోర్టు తెలిపింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం అయితే రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.


Also Read: Russia Ukraine News: అంతర్జాతీయ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు- పర్లేదా మరి?


Also Read: Yogi Adityanath Oath Date: యోగి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్- కేబినెట్‌లో వీరికే చోటు!

Published at: 17 Mar 2022 04:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.