టాటా పవర్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సైబర్ దాడి జరిగిందని, దీని కారణంగా సిస్టంలు ఎఫెక్ట్ అయ్యాయని కంపెనీ శుక్రవారం తెలిపింది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ సైబర్ దాడి జరిగింది. ఈ దాడి కొన్ని ఐటీ సిస్టమ్‌లపై ప్రభావం చూపిందని బీఎస్‌ఈ ఫైలింగ్ తెలిపింది.


సిస్టమ్‌లను పునరుద్ధరించడానికి కంపెనీ చర్యలు తీసుకుందని సమాచారం. అయితే అన్ని కీలకమైన ఆపరేషనల్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా, ఎంప్లాయీ అండ్ కస్టమర్ ఫేసింగ్ పోర్టల్‌లు, టచ్ పాయింట్‌లకు యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేశారు. ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేస్తున్నారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?