Vande Bharat Express in South:
చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో..
నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభించారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్-ముంబయి మధ్య సర్వీస్‌లు మొదలు పెట్టిన వెంటనే హిమాచల్‌లోనూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దక్షిణాదిన వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ఈ ట్రైన్‌ను నడపనున్నారు. నవంబర్ 10వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా
ప్రారంభించనున్నారు. మొత్తం 483 కిలోమీటర్లను కవర్ చేయనుంది...ఈ ఎక్స్‌ప్రెస్. ఎన్నికలున్న రాష్ట్రాల్లోనే వరుసగా ఈ వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభిస్తోంది కేంద్రం. ఇటీవలే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ పని పూర్తికాగా...వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలున్న తరుణంలో ఇప్పుడు బెంగళూరులోనూ ఈ సర్వీస్‌లు మొదలు పెట్టనున్నారు.
పీఎం గతి శక్తి..
2019ఫిబ్రవరి 15న మొదటి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైళ్లలో self-propelled engine ఉంటుంది. డీజిల్‌ను ఆదా చేయడంతో పాటు...30% విద్యుత్‌తోనే నడుస్తాయి. వందేభారత్ ట్రైన్స్‌ను సెమీ హై స్పీడ్ రైళ్లుగా చెబుతోంది ఇండియన్ రైల్వేస్. వీటిని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. ఆటోమెటిక్ డోర్స్, AC చెయిర్ కార్, రివాల్వింగ్ చైర్‌లు అందుబాటులో ఉంటాయి. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వెల్లడించారు. పీఎం గతిశక్తి లో భాగంగా ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది.
హిమాచల్‌లో నాలుగో ట్రైన్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉనాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం అక్కడకు వచ్చిన కార్యకర్తలు.. మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు 'మోదీ.. మోదీ, జై శ్రీరాం' వంటి నినాదాలతో రైల్వే స్టేషన్ పరిసరాలను హోరెత్తించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని రైల్వే ప్లాట్‌ఫాం నుంచి అలా నడుచుకొని వెళ్తూ జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది "దేఖో దేఖో కౌన్ ఆయా.. షేర్ ఆయా.. షేర్ ఆయా" (చూడు చూడు ఎవరు వచ్చారో.. పులి వచ్చింది.. పులి) అంటూ నినాదాలు చేశారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో.. నాలుగో వందే భారత్ ట్రైన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించిన తరవాత...ప్రధాని ఓ సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు తీర్చని సమస్యల్ని భాజపా తీర్చుతోందని, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటోందని వెల్లడించారు.
Also Read: Lokesh Unstoppable : అమ్మాయిలతో ఫోటోలు, ఎన్నికల్లో ఓటమిపై మామకు లోకేష్ ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలుసా ?