Omicron sub-variants : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల కేసులు మరో నాలుగు నమోదు అయ్యాయి. సోమవారం కస్తూర్బా హాస్పిటల్ లాబొరేటరీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ముగ్గురిలో ఒమిక్రాన్ BA.4 సబ్-వేరియంట్‌, ఒకరిలో BA.5 సబ్-వేరియంట్‌ ను ముంబైలో గుర్తించారు. ఈ నివేదిక ప్రకారం వీరిలో మే 14 నుంచి మే 24 మధ్యలో పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారని వైద్యాధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు 11 ఏళ్ల బాలికలు,  ఇద్దరు 40-60 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఉన్నారు.  బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని నివేదిక తెలిపింది. శనివారం 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ స్ట్రెయిన్ BA.5 సబ్-వేరియంట్‌ నిర్థారణ అయింది. అతడికి జూన్ 2న కోవిడ్-19 ఉన్నట్లు తేలింది. అతను వ్యాధి తేలికపాటి లక్షణాలను కలిగి, హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందారని నివేదిక తెలిపింది. 


ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి 


అతడు మే 21న ఇంగ్లాండ్ నుంచి వచ్చారని, కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. అంతకుముందు పూణెలో కనీసం ఏడు కేసుల్లో వైరస్ ఒమిక్రాన్ వేరియంట్స్ BA.4,  BA.5 COVID-19 సంక్రమణకు సంబంధించిన మొదటి కేసును మహారాష్ట్ర నివేదించింది. దేశంలో ఈ స్ట్రెయిన్ కు సంబంధించి మొదటి కేసు హైదరాబాద్ లో గుర్తించారు. BA.4 సబ్-వేరియంట్ గా నిర్థారించారు. తరువాత SARS-CoV2 జెనోమిక్స్ కన్సార్టియం తమిళనాడు, తెలంగాణలో BA.4, BA.5 సబ్-వేరియంట్‌లతో కేసులను గుర్తించినట్లు నిర్ధారించింది.


Also Read : Covid Update: దేశంలో కరోనా భయం- వరుసగా మూడో రోజూ 8 వేలకు పైగా కేసులు


తాజాగా 1885 కరోనా కేసులు 


మహారాష్ట్రలో ఇవాళ 1885 తాజా COVID-19 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 17,480కి చేరుకుంది. అంతేకాకుండా కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,871కి చేరుకుంది.






Also Read: Starbucks Update: మోకాళ్ల మీద పడి రిక్వెస్ట్ చేస్తా, దయచేసి ఆఫీస్‌కు రండి-స్టార్‌బక్స్ సీఈవో కష్టాలు