Covid Cases In India: భారత్‌లో కరోనా కేసులు మరోసారి తగ్గాయి. పాజిటివ్ కేసులు వరుసగా మూడోరోజు లక్ష దిగువన నమోదు కాగా, కొవిడ్ మరణాల సంఖ్య మాత్రం నిన్న సైతం వెయ్యి దాటడం ఆందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 67,597 (67 వేల 597) మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ 1,188 మంది మరణించారు. ఇటీవల వరుసగా అయిదు రోజులు వెయ్యి పైగా నమోదైన మరణాలు తగ్గాయి. కానీ నేడు మరోసారి వెయ్యికి పైగా కరోనా బాధితులు చనిపోయారు.
నిన్న ఒక్కరోజులో 1,80,456 (1 లక్షా 80 వేల 456) మంది కరోనా మహమ్మారిని జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 9,94,891 (9 లక్షల 94 వేల 891) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,04,062 (5 లక్షల 4 వేల 062)కు చేరింది. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 5.02 శాతానికి తగ్గింది.
170 కోట్ల కోవిడ్ డోసులు..
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 170 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 170 కోట్ల 21 లక్షల 72 వేల 615 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 2.25 శాతానికి తగ్గడం విశేషం. రికవరీ రేటు 96.46 శాతానికి పెరిగినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.
Also Read: Sarayu Arrest: బిగ్ బాస్ ఫేమ్ సరయూ అరెస్ట్, ఆమె అనుచరులు కూడా.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
Also Read: AP High Court: ఆ సినిమా థియేటర్‌ను తక్షణమే తెరవండి: ఎమ్మార్వోకు ఏపీ హైకోర్టు ఆదేశాలు