మణిపుర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ- సీఓటర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. తాజా సర్వేలో కాషాయ పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండనున్నట్లు తేలింది. 60 స్థానాలున్న మణిపుర్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.




అయితే ఈ ఎన్నికల్లో భాజపాకు కాస్త ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం భాజపా 21-25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా కాంగ్రెస్ 17-21 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నాగా ఎథినిక్ పార్టీ ఎన్‌పీఎఫ్ 6-10 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని తేలింది. ఇతరులకు 8-12 దక్కనున్నట్లు తెలుస్తోంది. 


ఓట్ల శాతం..



ఓట్ల శాతంలో కూడా భాజపా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది.



భాజపా-34%
కాంగ్రెస్-28%
ఎన్‌పీఎఫ్-10%
ఇతరులు- 28%





2017 ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన భాజపా స్థానిక పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ సాయంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ 28 సీట్లతో సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అధికారానికి దూరమైంది. 


ఇదే సవాల్..


ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం..  మణిపుర్‌‌ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఆర్మీ.. ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన మణిపుర్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


నాగాలాండ్‌లో భద్రతా బలగాల చేతిలో ఎటువంటి కారణం లేకుండా 14 మంది నాగా పౌరులు మరణించిన తర్వాత ఈశాన్య ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రత్యేక బలగాల  చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందంటే మణిపుర్‌ కూడా దాని ప్రభావానికి భిన్నంగా ఏమీ లేదు. 


Also Read: ABP News-CVoter Survey: గోవాలో ఈ సారి హంగ్.. ఆమ్‌ ఆద్మీ, ఎంజీకే పార్టీలు కింగ్ మేకర్లయ్యే చాన్స్ !


Also Read: UP Election 2022 Predictions: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మళ్లీ కమల వికాసం.. కానీ వెనుకే సైకిల్ రయ్‌రయ్‌!