CJP Protest: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ శనివారం దద్దరిల్లింది. కేవలం కొద్ది వారాల క్రితం సోషల్ మీడియా వేదికగా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటాలకు దిగింది. శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారి వీధుల్లోకి వచ్చింది.. నీటి పేపర్ లీక్, సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలు, వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ యువత డిమాండ్ చేస్తోంది.
ఈ ఉద్యమం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటీ?
ఈ ఉద్యమం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిరుద్యోగ యవతను, నకిలీ డిగ్రీలు ఉన్న వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలుగా, పరాన్న జీవులుగా అభివర్ణించారు. ఇదే ఈ వేదికకు కారణమైంది. మే 16న అభిజీత్ దీప్కే అనే యువకుడు ఈ విమర్శనే ఒక ఆయుధంగా మార్చుకొని కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేశాడు. తనను తాను బొద్దింకలుగా పిలుచుకుంటూ, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 2.2 కోట్లకుపైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ గ్రూప్ ఇప్పుడు డిటిల్ ప్రపంచం నుంచి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది.
జంతర్ మంతర్‌లో ఏం జరుగుతోంది?
శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు సీజేపీకి అనుమతి ఇచ్చారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. నిరసనకారులు తమతోపాటు జాతీయ జెండాను, ఒక పుస్తకాన్ని తెచ్చుకున్నారు. ఇది విద్య, దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.
సాధారణంగా నిరసనలు అంటే ఘర్షణలు, నినాదాలు ఉంటాయి. కానీ సీజేపీ శైలి భిన్నంగా ఉంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా, వారికి ప్రేమ, కృతజ్ఞతతో పూలు అందించాలని దీప్కే తన మద్దతుదారులను కోరారు. దేశ యువత ఇకపై భయపడదు, పోరాడుతుంది, బొద్దింకలు ఎప్పటికీ చావవు, భయపడవు అని యాయన అభిజీత్ ప్రకటించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే!
సీజేపీ ప్రధానంగా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవస్థాగత లోపాలపై పోరాడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న నీటి పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని వారు డిమాండే చేస్తున్నారు. 12వ తరగతి మూల్యాంకనంలో ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ వల్ల జరిగిన పొరపాట్లను వారు ఎత్తి చూపారు. విద్యావ్యవస్థలోని ఒత్తిడి, అక్రమాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.
ఉద్యమం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్
ఈ ఉద్యమం వెనుక కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, విద్యావంతులు కూడా ఉన్నారు. ఇందులో మొదటి వ్యక్తి అభిజీత్ దీప్కే. ఈయన బోస్టన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, గతంలో ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న వ్యూహకర్త.
సౌరవ్ దాస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, ఆర్టీఐ కార్యకర్త, వ్యవస్థలోని పారదర్శకతపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. అశుతోష్ రాంకా, విజేత దహియా విద్యావిధానాలు, పాలనపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తులు. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. ఒక వేళ అభిజీత్ దీప్కేను అరెస్టు చేస్తే, తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఢిల్లీలో భారీ భద్రత
ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 2వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని, 40 కంపెనీల పారామిలటరీ దళాలను జంతర్ మంతర్ , వీవీఐపీ నివాసాల వద్ద మోహరించారు. ఓలా, ఉబెర్ వంటి ప్రైవేటు క్యాబ్ బుకింగ్స్‌ో ఏమైనా అసాధారణ మార్పులు ఉన్నాయా అని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం ఒక ఎత్తు కాక్రోచ్ జనతా పార్టీకి ఇది మొదటి పెద్ద పరీక్ష.
