CBSE Verification Last Date Extended:దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మయించే సిబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు చుట్టూ ముసురుకున్న వివాదం సద్దుమణగడం లేదు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానం తెచ్చిన తంటాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకున్న బోర్డు రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తు గడువును జూన్ 7 అర్థరాత్రి వరకు పొడిగించింది. 

Continues below advertisement

రేపటి వరకు గడువు

గతంలో ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగియాల్సి ఉండగా పోర్టల్ స్లో అవ్వడం, పేమెంట్ ఫెయిల్యూర్స్ వంటి సమస్యల కారణంగా విద్యార్థులకు అదనపు సమయం కల్పిస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

2026 బోర్డు పరీక్షల కోసం సీబీఎస్‌ఈ తొలిసారిగా ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందులో విద్యార్థుల ఫిజిక్ ఆన్స్ షీట్‌లను స్కాన్ చేసి డిజిటల్ మూల్యాంకనం చేస్తున్నారు. అయితే మే 13న ఫలితాలు విడుదలైన తర్వాత అసలు కథ మొదలైంది. గత ేడాది 88.39 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈసారి 85.2 శాతానికి పడిపోయింది. ఇది విద్యార్థుల్లో అలజడికి కారణమైంది. 

Continues below advertisement

స్కాన్ చేసిన కాపీలు లేకపోవడం, జవాబు పత్రాలు కొన్ని పేజీలు కనిపించకపోవడం, ఒక విద్యార్థి రోల్ నెంబర్‌పై మరొకరి జవాబు పత్ర అప్‌లోడ్ అవ్వడం, రాసిన సమాధానాలకు మార్కులు వేయకపోవడం లేదా తక్కువ మార్కులు రావడం జరిగింది. ఢిల్లీకి చెందిన వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి తన ఫిజిక్స్ పేపర్‌లో తనది కాని హ్యాండ్ రైటింగ్ ఉందని సోషల్ మీడియాలో ఆధారాలతో నిరూపించడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. దీనిపై స్పందించిన బోర్డు , అది సాంకేతిక తప్పిదమని అంగీకరిస్తూ అతనికి సరైన పేపర్‌ను కేటాయించింది. 

ఫీజులు తగ్గింపు 

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సీబీఎస్‌ఈ ఫీజులను గణనీయంగా తగ్గించింది. గతంలో వెరిఫికేషన్ కోసం 500 వసూలుచేయగా, ఇప్పడు దానిని వంద రూపాయలకు తగ్గించారు. అలాగే రీ వ్యాల్యుయేషన్ కోసం ఒక్కో ప్రశ్నలు 100 రూపాయలుగా ఉన్న ఫీజును కేవలం 25 రూపాయలకు తగ్గించారు. 

ఎవరు దరఖాస్తు చేయాలి?

మీకు ఆశించిన మార్కులు రాలేదని భావిస్తే, మూల్యాంకనంలో తప్పులు జరిగాయని అనుమాన ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే కేవలం స్కాన్ చేసిన ఆన్సర్ షీట్ కాపీలను పొందిన విద్యార్థులు మాత్రమే రీ వాల్యుయేషన్‌, వెరిఫికేషన‌కు అర్హులు. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అధికారిక పోస్టర్ postresult.cbseit.in/pvr/ను సందర్శించాలి. మీ లోన్ నెంబర్‌, అడ్మిట్ కార్డు ఐడీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. 
  • డాష్ బోర్డులో వెరిఫికేషన్ ఇష్యూస్ పై క్లిక్ చేయాలి. మీకు ఏ సబ్జెక్ట్‌లో సమస్య ఉందో దానిని ఎంచుకోండి. 
  • ఒక వేళ పేజీలు మిస్ అయినా, స్కాన్ సరిగా లేకోయినా, లేదా వేరే విద్యార్థి పేపర్ వచ్చినా స్పష్టంగా చెప్పాలి. 
  • యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించి, అప్లికేషన్ కన్ఫర్మేషన్ డౌన్ లోడ్ చేసుకోండి. 

రీ వాల్యుయేషన్ vs వెరిఫికేషన్ తేడా 

చాలా మంది విద్యార్థులు ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. జవాబు పత్రంలో పేజీలు తగ్గినా, టోటలింగ్ తప్పుగా ఉన్నా, లేదా ఏదైనా సమాధానం దిద్దకుండా వదిలేసినా వెరిఫికేన్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ సమాధానం సరిగా ఉన్నప్పటికీ, మార్కింగ్ స్కీమ్ ప్రకారం మార్కులు తక్కువ వేశారని మీరు భావిస్తే, ఒక్కో ప్రశ్న వారీగా మళ్లీ దిద్దమని కోరవచ్చు. దీనికి రీవాల్యుయేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీని కోసం మీరు సీబీఎస్‌ఈ అఫీషియల్ మార్కింగ్ స్కీమ్‌తో మీ సమాధానాలు సరిపోల్చుకోవడం మంచిది. 

సైబర్ దాలులు 

ఈ ప్రక్రియ జరుగుతుండగానే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌పై జూన్ 3న భారీ స్థాయిలో డినైయల్ ఆఫ్ సర్వీస్ దాడి జరిగింది. సుమారు 38 లక్షల ప్యాకెట్లతో జరిగిన ీ దాడి వల్ల వెబ్‌సైట్ స్లో అయ్యింది. అయినప్పటికీ బోర్డు తన టెక్నికల్ టీమ్‌తో పరిస్థితిని చక్కదిద్దింది. మరోవైపు నిసర్గ అధికారి అనే విద్యార్థి ఈ పోర్టల్‌లో చాలా లోపాలు ఉన్నాయని, ఎవరైనా సులభంగా ఇంతరుల డేటాను యాక్సెస్ చేయవచ్చని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 

ప్రభుత్వం చర్యల 

ఈ మొత్తం గందరగోళానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాను తొలగించారు. ఈ లోపాలపై న్యాయవిచారణ జరిపించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, పార్లమెంటరీ కమిటీ కూడా దీనిపై విచారణ చేపట్టింది.