Granade Attack In Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడికి పాల్పడగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్‌కు సమీపంలో ఆదివారం నిర్వహించే వారసంతలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శ్రీనగర్‌లోని (Srinagar) ఖన్యార్ ప్రాంతంలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన పాకిస్థానీ అగ్ర కమాండర్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఒక రోజు అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రతా బలగాలను భారీగా మోహరించారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. లష్కరే తొయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్‌ను అంతమొందించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అనంత్‌నాగ్ జిల్లా షాంగస్ - లర్నూ ప్రాంతంలో జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలోనూ ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.






Also Read: Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం