Chandrayaan-3 Updates: 



100 మీటర్ల ప్రయాణం..


ఆదిత్య L1 ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో చంద్రయాన్ 3 గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఓ కీలక మైలురాయిని దాటిందని ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల మేర ప్రయాణించిందని వెల్లడించింది. ఇంకా అదే జోష్‌తో తిరుగుతోందని తెలిపింది. "ప్రజ్ఞాన్ 100" అంటూ ఓ ట్వీట్ చేసింది. రోవర్‌ని మరో రెండు రోజుల్లో స్లీప్‌ మోడ్‌లో పెడతామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. 


"చంద్రుడిపైన ప్రజ్ఞాన్ రోవర్ దూకుడు మీదుంది. 100 మీటర్లు ప్రయాణించింది. ఇంకా ప్రయాణిస్తూనే ఉంది"


- ఇస్రో