ల్యాండర్ విక్రమ్ ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్, నావిగేషన్ కెమెరాతో క్లిక్
Pragyan Rover Latest Images: ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్ ని తొలిసారి ఫొటో తీసి పంపిందని ఇస్రో వెల్లడించింది.
Pragyan Rover Latest Images:
ఇస్రో అప్‌డేట్..
చంద్రయాన్ 3 కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇస్రో. చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డేటాని పంపిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్‌ని (Lander Vikram) ఫొటో తీసి పంపింది. నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటో క్లిక్ చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరవాత ప్రజ్ఞాన్ రోవర్ తీసిన తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకూ అక్కడి నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ల్యాండర్ విక్రమ్ తీసినవే. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేసింది.
"Image of the Mission" అంటూ పోస్ట్ చేసింది. రోవర్‌పై ఉన్న NavCams (నావిగేషన్ కెమెరా)ని బెంగళూరుకి చెందిన Electro-Optics Systems కంపెనీ తయారు చేసింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి కీలక వివరాలు అందిస్తోంది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో ఎవరి వద్దా లేని అత్యంత అరుదైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇటీవలే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.