భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న విక్రమ్ ల్యాండర్ కనిపిస్తున్న అద్భుతమైన 3D చిత్రాన్ని పంచుకుంది. అనాగ్లిఫ్ (Anaglyph) టెక్నిక్‌ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లుగా ఇస్రో వెల్లడించింది. అనాగ్లిఫ్ అనేది స్టీరియో లేదా మల్టీ-వ్యూ ఇమేజెస్ నుంచి త్రీ డైమెన్షన్స్ లో తీసిన సింపుల్ విజువలైజేషన్ అని ఇస్రో వివరించింది.


‘‘ఇక్కడ చూపిస్తున్న అనాగ్లిఫ్ (ఫోటో) నావ్‌క్యామ్ స్టీరియో ఇమేజెస్ (NavCam Stereo Images) వాడి క్రియేట్ చేశారు. ఇందులో ప్రజ్ఞాన్ రోవర్‌ క్యాప్చర్ చేసిన ఎడమ, కుడి ఇమేజెస్ రెండూ ఉన్నాయి. స్పేస్ ఏజెన్సీ ఈ 3-ఛానల్ ఇమేజ్‌లో ఎడమ ఇమేజ్ ఎరుపు ఛానెల్‌లో ప్లేస్ చేసి ఉందని, కుడి ఫోటో బ్లూ, గ్రీన్ ఛానెల్స్‌ (సియాన్ కలర్ క్రియేట్ చేయడం) లో ప్లేస్ చేసి ఉంది. ఈ రెండు ఫోటోల మధ్య దృక్కోణంలో డిఫరెన్స్ స్టీరియో ఎఫెక్ట్‌కు దారి తీస్తుంది. ఇది త్రీ డైమెన్షన్స్‌ ఇంప్రెషన్ ఇస్తుంది’’ అని ఇస్రో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 3Dలో ఈ ఫోటోని చూడాలంటే త్రీడీ గ్లాసెస్ వాడాలని ఇస్రో సూచించింది. 


ఈ ఫోటో ఆగస్టు 30న తీసినదని ఫోటోలో స్పష్టంగా ఉంది. అంటే ప్రజ్ఞాన్ రోవర్‌ ను స్లీప్ మోడ్‌లోకి పంపడానికి ముందే ఈ ఫోటోని తీశారు.